Skip to main content

ఎయిమ్స్, మంగళగిరిలో పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌)–01, లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌),కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌–05.

ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌):
అర్హత: నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 55ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు.

లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫసర్‌), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌:
అర్హత: నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 నుంచి 2,08,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/
Last Date September 14,2021
Experience Fresher job

Photo Stories