ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, న్యూఢిల్లీలో 93 సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ).. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు/మేనేజర్ గ్రేడ్–2/సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 93
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కామర్స్/లా/మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్‌కి ప్రాధాన్యమిస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని 1:10 పద్ధతిలో మెయిన్స్ ఎగ్జామ్‌కి ఎంపికచేస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా తుదిఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.04.2022
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
చదవండి: Jobs in Visakhapatnam: ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు.. నెలకు రూ.20.200 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |