ECGC Limited Recruitment: ఈసీజీసీ లిమిటెడ్, ముంబైలో 75 పీఓ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
ముంబైలో ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీజీసీ).. ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 75
అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ప్రిలిమినరీ పరీక్షను 200 మార్కులకు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 140 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష 40 మార్కులకు ఉంటుంది. దీనిలో ఎస్సే రైటింగ్ 20 మార్కులకు, ప్రీసిస్ రైటింగ్ 20 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 40 నిమిషాలు ఉంటుంది.
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూని 60 మార్కులకు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
పరీక్ష తేది: 29.05.2022
వెబ్‌సైట్: https://www.ecgc.in/
చదవండి: Bank Jobs: ఎస్‌బీఐలో టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |