Skip to main content

భార‌త్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీలు..అర్హతలు ఇవే..

ఘజియాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భార‌త్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 50
ఖాళీల వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–20, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–10, ఎలక్ట్రానిక్స్‌–10, సివిల్‌ ఇంజనీరింగ్‌–10.
శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. »
వయసు: 30.11.2021 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.11,110 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.08.2021

వెబ్‌సైట్‌: www.bel-india.in
Last Date August 29,2021
Experience Fresher job

Photo Stories