Skip to main content

Assistant Coach Posts in SAI: సాయ్‌లో 220 అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 220
క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కయాకింగ్, ఖో ఖో, రోయింగ్, సెపక్‌ తక్రా, షూటింగ్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు.
అర్హత: సాయ్, ఎన్‌ఎస్, ఎన్‌ఐఎస్‌/ఇతర ఇండియన్‌/ఫారిన్‌ యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఒలింపిక్‌/ఇంటర్నేషనల్‌లో పాల్గొనడం/ద్రోణాచార్య అవార్డు సాధించి ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.41,420 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in
Last Date October 10,2021
Experience Fresher job

Photo Stories