ఐడీబీఐ 650 ఉద్యోగాలు..అర్హతలు ఇవే..
Sakshi Education
ముంబైలోని ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్ (బెంగళూరు), నిట్టే(గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో.. ఏడాది(9 నెలలు క్లాస్‌రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్) పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా(పీజీడీబీఎఫ్)లో శిక్షణ ఇస్తోంది.
ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా నియామకం ఖరారు చేస్తోంది.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్.
మొత్తం ఖాళీల సంఖ్య: 650
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తగ్గిస్తారు.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021
పరీక్ష నిర్వహణ తేది: 04.09.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్‌సైట్: www.idbibank.in
Last Date | September 04,2021 |
Experience | Fresher job |