NIMS Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు..
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్–02, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, హెల్పర్స్–02.
అర్హత: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ/డీఎన్‌బీ(రేడియో డయాగ్నోసిస్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,30,000 చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీతోపాటు డేటా ఎంట్రీలో అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.15000 చెల్లిస్తారు. హెల్పర్‌కు నెలకు రూ.7500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్–500082 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021
వెబ్‌సైట్: https://www.nims.edu.in
చదవండి: NIMS Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో మెడికల్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.36 వేల వరకూ వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 27,2021 |
Experience | 1 year |
For more details, | Click here |