ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో మెడికల్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ).. స్పెషలిస్ట్ గ్రేడ్–2(సీనియర్ స్కేల్, జూనియర్ స్కేల్) మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 47
విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితరాలు.
రాష్ట్రాల వారీగా ఖాళీలు: హిమాచల్ ప్రదేశ్–12, ఒడిశా–22, అసోం–02, తమిళనాడు–11.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 45ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.78,800 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల ఈఎస్‌ఐసీ రీజనల్ కార్యాలయాలకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
చదవండి: Medical Staff Posts: ఐటీబీపీలో 553 మెడికల్ స్టాఫ్ పోస్టులు
Qualification | POST GRADUATE |
Last Date | November 01,2021 |
Experience | 1 year |
For more details, | Click here |