Medical Staff Posts: డీఎంహెచ్‌వో, అనంతపురంలో మెడికల్ స్టాఫ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01,జన రల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–19, స్టాఫ్ నర్సులు–25, సైకియాట్రిక్ నర్స్–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్– 02, సోషల్‌వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–02,శానిటరీ అటెండెంట్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ, బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయిటేజీ కేటాయించి తుది జాబితా విడుదలచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |