Medical Officer Posts: డీఎంహెచ్‌వో, కర్నూలులో మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో)..నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 62
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–28, స్టాఫ్ నర్స్‌లు–22, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |