Skip to main content

NISE Recruitment 2023: ప‌రీక్ష లేకుండానే 70 వేల జీతంతో నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన గురుగ్రామ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ (ఎన్‌ఐఎస్‌ఈ).. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ / మెకానికల్ / రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
NISE Recruitment 2023
NISE Recruitment 2023

అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 3 నుంచి ఆరేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భ‌ర్తీ చేస్తారు. మొత్తం 10 ఖాళీలున్నాయి. అర్హులైన‌ అభ్యర్ధులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు (ఏప్రిల్‌ 30) దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం అధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.53,000 నుంచి రూ.70,000 వరకు జీతంగా చెల్లిస్తారు. 
ఈమెయిల్: recruitment.nise@nise.res.in 

చ‌ద‌వండి: ముగ్గురూ ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి..  ఆద‌ర్శంగా నిలుస్తున్నారిలా...

Published date : 17 Apr 2023 05:49PM
PDF

Photo Stories