Success Story: తిండి లేకున్నా కష్టపడి చదివి... ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారిలా...
మంచిగా చదువుకుని, ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కష్టాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నారు. ఆ లక్ష్యంతోనే చదివి ఇంట్లోని ముగ్గురూ ప్రభుత్వ కొలువులు సాధించి పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
చదవండి: ఇకనుంచి లోకల్ లాంగ్వేజ్‌లోనే పరీక్షలు... పూర్తి వివరాలు ఇవే
అప్పు చేసి దుబాయికి...
గంగారం, లక్ష్మి దంపతులది నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం. వీరికి ముగ్గురు సంతానం. పిల్లలు పుట్టడంతో వారి చదువులకు, కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి గంగారం దుబాయికి వెళ్లాడు. తల్లి లక్ష్మి ఇంటి పట్టునే ఉంటూ బీడీలు చుడుతూ పిల్లలను చదివించింది. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన ఆ పిల్లలు జీవితంలో త్వరగా సెటిలవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఆ సంకల్పంతోనే చదివి ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఇంటెలిజెన్స్ ఎస్ఐగా....
పెద్ద కొడుకు పృథ్వీరాజ్ ఏడో తరగతి వరకు డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 8వ నుంచి పదో తరగతి పోచంపాడ్ గురుకులంలో.. నిజామాబాద్ కాకతీయలో ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడంతో సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈలో జాయిన్ అయ్యాడు. గేట్‌లో ర్యాంకు రావడంతో ఎంటెక్ పూర్తి చేశాడు. 2018లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక 2020లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు.
చదవండి: 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే
ఆ పట్టుదలతోనే చదివా....
నేను ఎనిమిదో తరగతి వరకు డొంకేశ్వర్, అక్కడి నుంచి ఇంటర్ వరకు కాకతీయలో చదివా. తర్వాత ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేశా. 2018లో టీఎస్‌పీఎస్సీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రిపేర్ అయ్యాను. 2020లో జాబ్ సాధించా. ప్రస్తుతం నవీపేట మండలం ఆశాజ్యోతి కాలనీ గ్రామంలో పని చేస్తున్నా. చిన్ననాటి నుంచి పట్టుదలతో చదవడం వల్ల ఫలితం దక్కింది.
– బొమ్మెన శ్రీవాణి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి
చదవండి: ఇలా చేస్తే 16 లక్షలు మీవే... ఎలాగో తెలుసుకోండి
అన్న ప్రోత్సాహంతో..
నేను ఏడోతరగతి వరకు డొంకేశ్వర్‌లో చదువుకున్నా. అనంతరం మద్నూర్ గురుకులంలో సీటు వచ్చింది. ఇంటర్ నారాయణ కాలేజీలో చదివాను. ఏఐట్రిపుల్‌ఈలో మంచి ర్యాంకు రావడంతో కాలికట్ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. హెచ్‌ఎండబ్లూఎస్‌లో టీఎస్‌పీఎస్సీ ద్వారా 2015లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అన్నయ్య ప్రోత్సాహంతో ఐప్లెచేసి పరీక్ష రాశాను. 2016లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోని జెన్‌కోలో ఏఈగా పనిచేస్తున్నా.
- బొమ్మెన దేవరాజ్, ఏఈ, జెన్‌కో