ChatGPT: ఇలా చేస్తే 16 లక్షలు మీవే... ఎలాగో తెలుసుకోండి
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం చాట్‌జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది మన కరెన్సీలో రూ. 16 లక్షల కంటే ఎక్కువ. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
చదవండి: ఈ కోర్సులకు పిచ్చ డిమాండ్... ఫ్రెషర్లకే లక్షల్లో ప్యాకేజీ
200 డాలర్ల నుంచి 20,000 డాలర్ల వరకు
ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్ చాట్‌జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇందులో 200 డాలర్ల నుంచి గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే. కానీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పని. అయితే గతంలో సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలున్నాయి.
చదవండి: ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చాట్ బోట్స్.. నిరుద్యోగులకు ఇక నిద్రలేని రాత్రులే
ఇప్పటికే ఇటలీలో బ్యాన్...
చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్‌జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్‌ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.