Skip to main content

ChatGPT: అనుకున్న‌దే అయ్యింది... ఉద్యోగాల‌కు ఎస‌రు పెట్టిన చాట్ బోట్స్‌.. నిరుద్యోగుల‌కు ఇక‌ నిద్ర‌లేని రాత్రులే

ప్ర‌స్తుతం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఎరా న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా ఏఐకి సంబంధించిన వార్తలే క‌నిపిస్తున్నాయి. వీటి వ‌ల్ల ఉద్యోగాల‌కు ఏ ఢోకా ఉండ‌ద‌ని ఇంత‌వ‌ర‌కు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఏఐతో భారీగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఉద్యోగుల స్థానాల్ని ఏఐ చాట్‌బోట్‌లు ఆక్రమించగా.. భవిష్యత్‌లో భారత్‌ వంటి దేశాల్లో వీటి వల్ల నిరుద్యోగం పెరిగిపోతుందంటూ మార్కెట్ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే అమెరికాలో సగానికిపైగా కంపెనీలు ఉద్యోగుల స్థానంలో చాట్‌బోట్స్ ని ఏర్పాటు చేసే ప్రయాత్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. ఇలా ఒక్క యూఎస్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు పట్టిపీడిస్తున్నాయి. కానీ చాటీజీపీటీని తయారు చేసిన దీని మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ మాత్రం చాట్‌ జీపీటీ.. ఉద్యోగుల స్థానాల్ని ఆక్రమించబోదని, ఉద్యోగులకు సహాయం చేసేందుకు మాత్రమే ఉంటుంద‌ని చెబుతోంది.

చ‌ద‌వండి: చాట్‌ జీపీటీకి గూగుల్ షాక్‌....బార్డ్‌తో చాట్‌జీపీటీకి చెక్‌..?
జీపీటీ- 4 విడుదల...
ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్ జీపీటీకి అప్‍డేటెడ్ వెర్షన్ జీపీటీ- 4ను విడుదల చేసింది. ప్రస్తుత చాట్‍జీపీటీ-3.5 కన్నా ఇది మరింత వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెబుతుండడంతో దీని పనితీరుపై యూజర్లలో ఆసక్తి మొదలైంది. చాట్‌జీపీటీ-4 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌స్తే 20 రకాల ఉద్యోగాల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా ఇది పనిచేసే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ
ఆ 20 రకాల ఉద్యోగాలు ఇవే...
డేటా ఎంట్రీ క్లర్క్‌, కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటీవ్‌, ఫ్రూఫ్‌రీడర్‌, పారా లీగల్‌, బుక్‌కీపర్‌, ట్రాన్స్‌లేటర్‌, కాపీరైటర్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌, సోషల్‌ మీడియా మేనేజర్‌, అపాయింట్మెంట్‌ షెడ్యూలర్‌, టెలీ మార్కెటర్‌, వర్చువల్‌ అసిస్టెంట్‌, ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌, న్యూస్‌ రిపోర్టర్‌, ట్రావెల్‌ ఏజెంట్‌, ట్యూటర్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ అనలిస్ట్‌, ఈమెయిల్‌ మార్కెటర్‌, కంటెంట్‌ మోడరేటర్‌, రిక్రూటర్‌ వంటి జాబుల్ని చాట్‌జీపీటీ-4 రీప్లేస్ చేయ‌నుంది.

Published date : 18 Mar 2023 05:17PM

Photo Stories