Skip to main content

Science And Technology: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ... చాట్‌జీపీటీ అంటే ఏంటో తెలుసా..?

ఒపెరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌... ఒకప్పుడు నెట్‌ సామాజ్రాన్ని ఏలాయి. గూగుల్‌ రాగానే పైవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గూగుల్‌ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సర్చ్‌ ఇంజిన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి.

సెర్చ్‌ ఇంజిన్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గూగుల్‌కు చాట్‌జీపీటీ గుబులు పుట్టిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తుండడంతో ఇప్పుడు యూజర్లు చాట్‌జీపీటీ వైపు మళ్లుతున్నారు. 
మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడులు..
సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ. దీని మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆ కంపెనీలో 1 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్‌.. మరో 10 బిలియన్‌ డాలర్లను పెట్టేందుకు సిద్ధమైంది. అలాగే ఎలాన్‌మల్స్‌ కూడా ఇందులో భారీగా పెట్టుబడులు పెడుతుండడం విశేషం. మరికొంతమంది టెక్‌ దిగ్గజాల చూపు ఇప్పుడు చాట్‌జీపీటీపై పడింది. చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ 10 బి.డాలర్లు పెట్టుబడి పెడితే మొత్తం సంస్థలో మైక్రోసాఫ్ట్‌కు 49 శాతం, ఇతరు ఇన్వెస్టర్లకు 49 శాతం వాటా దక్కే అవకాశం ఉంది. 

chat gpt


ఏమిటీ చాట్‌జీపీటీ..?
శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ ఏఐ అనే సంస్థ తృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. 2015లో శామ్‌ ఆల్ట్‌మన్, ఎలాన్  మస్క్‌ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్‌ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్‌ కూడా ఇందులో 1 బిలియన్‌  డాలర్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతానికి ఇదింకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్‌ ఏఐ.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకొని దీన్ని వినియోగించి చూడవచ్చు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌ బింగ్‌లో ఏఐ తరహా ఫీచర్‌ను జోడించాలని ఆ కంపెనీ ఆలోచన. తద్వారా ప్రముఖ సెర్చింజిన్‌  గూగుల్‌కు పోటీనివ్వాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది.

చ‌ద‌వండి: రేపే కానిస్టేబుల్ ఎగ్జామ్‌.. నిమిషం ఆల‌స్య‌మైనా ఇంట్లో కూర్చోవాల్సిందే

 

chat gpt


చాట్‌ జీపీటీ అద్భుతం : గౌతమ్‌ అదానీ
చాట్‌జీపీటీపై పారిశ్రామిక దిగ్గజాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ కూడా ఈ జాబితాలో చేరారు. దీన్ని వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకూ ఇది కొంత వ్యసనంలా మారిందని అదానీ పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో అంతటా ఏఐ గురించే ప్రధానంగా చర్చ జరిగిందని లింక్డ్‌ఇన్‌లో అదానీ రాశారు.
మనిషుల్లాగే సమాధానాలు...
ఎంతో ఉపయోగకరమైన ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు చాట్‌జీపీటీ తోడ్పడగలదని అదానీ తెలిపారు. జోకులు, పద్యాలు, వ్యాసాలు మొదలుకుని కంప్యూటర్‌ కోడింగ్‌ వరకు ఎలాంటి అంశం అయినా అనంతమైన సమాచారాన్ని క్రోడీకరించి యూజర్‌కు కావాల్సినట్లుగా కంటెంట్‌ను చాట్‌జీపీటీ అందిస్తుంది. యూజర్లతో అచ్చం మనుషుల్లాగే సందర్భోచితంగా సంభాషిస్తుంది.

Published date : 21 Jan 2023 01:33PM

Photo Stories