Jobs: ఈ కోర్సులకు పిచ్చ డిమాండ్... ఫ్రెషర్లకే లక్షల్లో ప్యాకేజీ
ఎక్కువగా కోరుకునే రంగాలు ఇవే...
ఏఐలో డేటా సైంటిస్ట్, ఎంఎల్ (Machine Learning) ఉద్యోగాలకు డిమాండ్ అధికంగా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో సమయం, డబ్బు ఆదా చేస్తూ మిలియన్ల మంది వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఈ కోర్సులు ఉన్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ టీమ్‌లీజ్ చేసిన సర్వేలో 37 శాతం సంస్థలు ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. ఈ విభాగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 30 శాతం కంపెనీలు ఉద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. ఫ్రెషర్లకు దాదాపు 45 వేల ఉద్యోగాలు ఉన్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది.
చదవండి: మీమ్స్ వేస్తే లక్ష రూపాయలతో ఉద్యోగం మీదే
భారత్‌లో వీరికి ఫుల్ డిమాండ్
ఇక, భారత్‌లో ప్రస్తుతం ఫ్రెషర్లగా విధులు నిర్వహించే ఇంజినీర్లకు ఏడాదికి రూ.14 లక్షల వరకు, ఎంఎల్ ఇంజినీర్లకు రూ.10 లక్షలు, డేటా సైంటిస్ట్‌లకు రూ.14 లక్షలు, డెవాప్స్ ఇంజినీర్లకు రూ.12 లక్షలు, డేటా ఆర్కిటెక్చర్‌కు రూ.12 లక్షలు, బీఐ అనాలసిస్‌కు రూ.14 లక్షలు, డేటాబేస్ అడ్మిన్‌కు రూ.12 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు టీమ్ లీజ్ నివేదిక వెల్లడించింది.