Skip to main content

Jobs: మీమ్స్ వేస్తే లక్ష రూపాయ‌ల‌తో ఉద్యోగం మీదే

మీమ్స్‌..! సీరియస్‌ విషయాన్ని ఎవరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడమే. అలా మీమ్స్‌ చేసే టాలెంట్ మీలో ఉంటే కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. లేదంటే ఆఫీస్‌లో కూర్చొని ఐటీ ఉద్యోగుల జీతాలకు ఏమాత్రం తీసిపోకుండా మీమ్స్‌ చేసుకుంటూ భారీ ప్యాకేజీ తీసుకోవచ్చు. ఆశ్చర్య పోతున్నారా? లేదంటే నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ వివ‌రాలు మీ కోసమే..!

ఇప్పుడు ఎవ‌రూ చూసినా సోష‌ల్ మీడియా వాడుతున్నారు. వారి ఉద్దేశాలు, భావాల‌ను ప‌దిమందితో పంచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది త‌మ క్రియేటివ్ థాట్స్‌కు అక్ష‌ర రూపం ఇస్తున్నారు. అలా పుట్టుకొచ్చిన‌వే మీమ్స్‌. ఒక‌ విష‌యాన్ని వ్యంగ్యంగా చెప్ప‌డంతో పాటు.. ఆ విష‌యం ప‌దిమంది మెద‌ళ్ల‌లో నానేలా ఉండాలి.. సెటైరిక‌ల్‌గా రీచ్ ఉన్న మీమ్స్ క్రియేట‌ర్స్‌ని తమ బ్రాండింగ్‌కి వాడుకుంటున్నాయి. యూజర్ల దృష్టిని ఆకట్టుకునేలా మీమ్స్‌ని క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తే చాలు. అవి వైరల్‌ అవుతూ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ అవుతుంది.

చ‌ద‌వండి: కంపెనీ అంటే ఇలా ఉండాలి... ఉద్యోగుల‌కు ఐదేళ్ల జీతం బోన‌స్‌
చీఫ్‌ మీమ్‌ ఆఫీసర్ పోస్ట్‌కు....
బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే సంస్థ మీమ్స్‌ తయారు చేసే మీమర్స్‌కు బంపరాఫర్‌ ఇచ్చింది. చీఫ్‌ మీమ్‌ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష శాలరీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాల్లో మిలీనియల్స్‌, జెన్‌జెడ్‌ (జనరేషన్‌ జెడ్‌) వయసు వారే లక్ష్యంగా మీమ్స్‌ తయారు చేయాలంటూ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌ పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీమ్స్‌ చేసే టాలెంట్‌ ఉంటే చీఫ్‌ మీమ్‌ ఆఫీసర్‌ జాబ్‌ కొట్టేయండి.

చ‌ద‌వండి: సెంట్ర‌ల్ బ్యాంకులో 5వేల ఖాళీలు... పూర్తి వివ‌రాలు ఇవే
మిలీనియల్స్‌ అంటే..జెన్‌ జెడ్‌ అంటే?
వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్‌ జనరేషన్‌. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో..అంటే 1946–1964 మధ్య పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్‌’ జనరేషన్‌గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్‌ ఎక్స్‌. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్‌ వై. అంటే మిలీనియల్స్‌. ఆ తరవాత పుట్టిన వారిని ‘జనరేషన్‌ జెడ్‌’గా పిలుస్తున్నారు.

Published date : 22 Mar 2023 06:01PM

Photo Stories