Skip to main content

EverGreen: కంపెనీ అంటే ఇలా ఉండాలి... ఉద్యోగుల‌కు ఐదేళ్ల జీతం బోన‌స్‌

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఆర్థిక‌మాంద్యం వార్త‌లే క‌నిపిస్తున్నాయి. ఆర్థిక‌మాంద్యంను బూచిగా చూపి కంపెనీల‌న్నీ త‌మ ఉద్యోగుల‌పై వేటు వేస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల‌ను వ‌దిలించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ కంపెనీ త‌న ఉద్యోగుల‌కు ఐదేళ్ల బోనస్ ప్ర‌క‌టించింది. ఆ కంపెనీ ఏంటో.. ఎక్క‌డో ఓ లుక్కేద్దామా..!
EverGreen
EverGreen

తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్‌ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులకు బోనస్‌గా ఇస్తున్న‌ట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. అలాగే ఈ ఏడాది శాల‌రీ హైక్ కూడా భారీగా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఎవర్‌గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ సూయజ్ కెనాల్‌లో చిక్కుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వార్త‌లకెక్కిన సంగ‌తి తెలిసిందే. 

చ‌ద‌వండి: ఇక‌పై ఎక్క‌డైనా ప్లాట్ కొనుగోలు చేయొచ్చు... 20 శాతం త‌క్కువ‌కే
భారీగా అంద‌నున్న బోన‌స్‌
ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు రూ.37,00,807 నుంచి రూ.1,41,55,950 మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్ పేర్కొంది. ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్‌గ్రీన్‌ 16.25 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. అయితే గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే త‌మ ఉద్యోగుల‌కు 50 నెల‌ల జీతాన్ని బోన‌స్ ఇస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది హైక్‌ల‌తో క‌లుపుకుంటే ఉద్యోగులు మొత్తంగా ఐదేళ్ల జీతానికి స‌మాన‌మైన మొత్తాన్ని అందుకోనున్నారు. కంపెనీకి వ‌చ్చిన లాభాల‌లో కొంత భాగాన్ని ఇలా ఉద్యోగ‌స్తుల‌కు పంచ‌డంతో కంపెనీ ఉద్యోగులు ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు.

చ‌ద‌వండి: సెంట్ర‌ల్ బ్యాంకులో 5వేల ఖాళీలు... పూర్తి వివ‌రాలు ఇవే

Published date : 22 Mar 2023 02:01PM

Photo Stories