Skip to main content

CAPF Exam: ఇక‌నుంచి లోక‌ల్ లాంగ్వేజ్‌లోనే ప‌రీక్ష‌లు... పూర్తి వివ‌రాలు ఇవే

కేంద్ర సాయుధ పోలీసు బలగాల కానిస్టేబుల్ (CAPF) పరీక్ష విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహణకు ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్‌ల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది.
SSC GD Constable Exam
SSC GD Constable Exam

చ‌ద‌వండి: 20 ప్ర‌శ్న‌ల‌కు అర‌లీట‌ర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే

జనవరి 1 నుంచి ఇది అమల్లోకి
తాజా నిర్ణ‌యంతో హింది, ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. వ‌చ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(CRPF) ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఇటీవల డిమాండ్లు వినిపించిన నేప‌థ్యంలో తాజా ప్రకటన వెలువడింది. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles)లు వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ (జీడీ) ఒకటి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు దీనికి హాజరవుతుంటారు.

చ‌ద‌వండి: ఈ నెల 29న జేఈఈ మెయిన్‌ ఫలితాలు!

Published date : 15 Apr 2023 05:05PM

Photo Stories