Skip to main content

Jobs: అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా. సురేష్‌ జూన్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Applications for Guest Lecturers

వృక్షశాస్త్రం–1, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌–2, తెలుగు–2, ఆంగ్లం–3 ఖాళీలున్నాయని పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కు లు, ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులు ఉండాలని, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, నీట్‌/సెట్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

చదవండి: Free Education: ‘చదువుకునే వారికి చదువు‘కొనే’ అవసరం లేదంటూ’.. ప్రభుత్వ కాలేజీ ‘ఫ్లెక్సీ’

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ధ్రువపత్రాలతో జూలై 3వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Published date : 01 Jul 2024 05:57PM

Photo Stories