Skip to main content

Government Employees: ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే కౌన్సెలింగ్‌ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం తీర్మానించింది.
Employee transfer counseling  Central Association  Hyderabad updates  Ban on transfer of employees should be lifted  Telangana government employees

జూన్ 16న‌ నాంపల్లిలోని గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ ఈ సమావేశాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలు, సరీ్వసు అంశాలపై చర్చించారు.

చదవండి:SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

అనంతరం 17 అంశాలతో కూడిన తీర్మాన ప్రతిని ప్రవేశపెట్టగా కేంద్ర సంఘం కార్యవర్గంతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగుల ఫోరం, 54 శాఖల ఫోరమ్‌లు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి.

జిల్లాల వారీగా, శాఖ ల వారీగా టీజీఓ ఫోరమ్‌ల ఏర్పాటుకు కేంద్ర సంఘం ఆమోదం తెలిపింది. ఈ తీర్మాన ప్రతిని మంత్రివర్గ ఉపసంఘానికి, త్రిసభ్య కమిటీకి అందించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు. సమావేశంలో టీజీఓ కేంద్ర సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు బి.శ్యామ్, ఉపాధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

తీర్మానంలోని ప్రధాన అంశాలు 

  • ఉద్యోగుల బదిలీలపై బ్యాన్‌ ఎత్తివేసి కౌన్సెలింగ్‌ పద్ధతిన తక్షణమే నిర్వహించాలి 
  • ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయి లను చెల్లించాలి. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి 
  • ఆర్థిక శాఖలో పెండింగ్‌లోని సప్లిమెంటరీ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలి 
  • జీఓ 317 దరఖాస్తులన్నీంటినీ పరిష్కరించాలి 
  • 2వ పీఆర్సీ మధ్యంతర భృతి 5% నుంచి 20% పెంచాలి 
  • వైద్య,ఆరోగ్య శాఖలో జీఓ 142ను çసమీక్షించాలి 
  • కొత్త జిల్లాల్లో అదనపు కేడర్‌ స్ట్రెంథ్‌ మంజూరు చేయాలి 
  • అధికారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి. 
Published date : 17 Jun 2024 12:53PM

Photo Stories