ChatGPT: 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే
ప్రపంచంలోని ప్రతి అంగుళాన్ని ఇది ఆక్రమించింది. ఏ మూల ఏ ప్రశ్న అడిగినా చిటికెలో సమాధానమిస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే... నాణేనికి మరోవైపు చూస్తే చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి.
చదవండి: ఇలా చేస్తే 16 లక్షలు మీవే... ఎలాగో తెలుసుకోండి
సర్వర్‌లను చల్లబరచడానికి...
ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ChatGPTని ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా ఉపయోగించుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్‌టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి అర లీటరు నీరు అవసరం అవుతుందని అంచనా వేశారు. ChatGPT వంటి ఏఐ మోడల్‌లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్‌లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీరు అవసరం అవుతుంది.
చదవండి: ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చాట్ బోట్స్.. నిరుద్యోగులకు ఇక నిద్రలేని రాత్రులే
మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని.....
అలాగే డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని కూడా శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. వీటికి మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుంది. జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ దాదాపు 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించిందని శాస్త్రవేత్తలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉండనుంది. అలాగే ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.