Skip to main content

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా

Mega Job Mela tomorrow

సిద్దిపేటఎడ్యుకేషన్‌: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సెప్టెంబర్ 21న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో 25 రాష్ట్ర, జాతీయస్థాయి కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చదవండి: Walk-in Interviews: నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా

Published date : 20 Sep 2023 03:19PM

Photo Stories