Skip to main content

UPSC Exam: యూపీఎస్సీలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్ష 2024

ఈ పరీక్ష ద్వారా ప్రకటించిన పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు చేసుకోవచ్చు..
Central Armed Forces  Examination-2024 advertisement    Central Armed Police Forces Exam in UPSC 2024  Central Industrial Security Force   Central Reserve Police Force Border Security Force

సాక్షి ఎడ్యుకేషన్‌: న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌(అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌–2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్ల (గ్రూప్‌ ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 506
»    పోస్టుల వివరాలు: బీఎస్‌ఎఫ్‌–186, సీఆర్‌పీఎఫ్‌–120, సీఐఎస్‌ఎఫ్‌–100, ఐటీబీపీ–58, ఎస్‌ఎస్‌బీ–42.
»    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి 
ఉండాలి.
»    వయసు: 01.08.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్‌1, పేపర్‌2), ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 15.05.2024 నుంచి 21.05.2024.
»    రాతపరీక్ష తేది: 04.08.2024.
»    వెబ్‌సైట్‌: https://upsc.gov.in

ADCET-2024: ఏడీసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..

Published date : 29 Apr 2024 12:21PM

Photo Stories