Skip to main content

Work From Home: ల‌క్ష‌ల జీతం ఏం చేసుకోను...మ‌న‌శ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేద‌న‌..!

వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్‌. బిటెక్‌ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్‌ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్‌ సెటిల్‌ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్‌ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్‌ కమ్‌ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్‌ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్‌ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్‌ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్‌.

కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులు అనుభవిస్తున్న ఆ భోగభాగ్యాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ కంపెనీలు చెల్లించే లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఏం చేసుకోను. మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడే వారు లేకపోతే’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. 

☛ అద‌ర‌గొట్టిన వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థి.... 88 ల‌క్ష‌ల ప్యాకేజీతో రికార్డు 

లక్షలు ప్యాకేజీ ఏం చేసుకోను?
ఇటీవల బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన వ్యక్తి గత జీవితం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘నేనో ప్రముఖ టెక్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నా. శాలరీ రూ.58 లక్షలు. అయినా సరే సంతృప్తిగా లేను. ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతున్నాను. ప్రేమగా మాట్లాడేందుకు ప్రేమికురాలు లేదు. స్నేహితులేమో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు’ అంటూ తన బాధను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. దీంతో అయ్యో పాపం! అనడం నెటిజన్ల వంతైంది. 

IT Employees

 ఐటీ హ‌బ్‌గా వైజాగ్‌... రెండు నెల‌ల్లో 2 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగుల్ని మరో ప్యాండమిక్‌ ముంచేస్తుందా? 
ఐటీ ఉద్యోగుల్లో ఈ తరహా ధోరణికి కారణం కంపెనీల్లో మారిపోతున్న వర్క్‌ కల్చరేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్‌-19 కారణంగా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో  రిమోట్‌ వర్క్‌ కల్చర్‌ని అమలు చేశాయి. అది కాస్త సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. దీంతో ఉద్యోగులు నెలల తరబడి ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. కానీ ఇలాగే కొనసాగితే వర్క్‌ కల్చర్‌లో కోవిడ్‌ కాకుండా మరో ప్యాండమిక్‌ సైతం ఆవహించేస్తుందని, ఆ ప్యాండమిక్‌ పేరే ఒంటరితనమని అంటున్నారు టెక్‌ నిపుణులు. 

IT Employees

ఎంఐటీ ఏం చెబుతోంది
ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అనేక లాభాలున్నాయి. వర్క్‌ ప్రొడక్టివిటీ పెరగడం, ప్రయాణం, ఖర్చులు, డబ్బులు ఆదా చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గడపం వంటి స్వల్ప కాలంలో బాగుంటాయి. కానీ సూదీర్ఘంగా ఇలా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం వల్ల ఉద్యోగుల్లో ఒంటరి తనం పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైతం తెలిపింది. రిమోట్‌ వర్క్‌తో సహచర ఉద్యోగులతో గడపలేకపోవడం, ఇతరులపై నమ్మకం పెరగడం, శరీరాన్ని కష్టపెట్టకపోవడం వల్ల శారీరక ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు న్యూరో సైన్స్‌ అధ్యయనంలో తేలింది.   

 అయ్యో పాపం... చేరిన ప్ర‌తీ కంపెనీలోనూ మొండిచేయే...

IT Employees

అందరి మధ్యలో ఉన్నా ఒంటరిగా
ఆఫీస్‌లో పనిచేస్తూ సహచరులతో మాట్లాడడం, క్యాంటీన్‌లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. మహమ్మారి ప్రారంభ నెలల్లో రిమోట్‌గా పని చేస్తున్నప్పుడు ఐదుగురిలో ముగ్గురు (60శాతం) భారతీయ ఐటీ నిపుణులు ఏదో ఒక సమయంలో అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్నామని భావించారు. 16,199 మంది భారతీయ టెక్‌ నిపుణులపై లింక్డిన్‌ సంస్థ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. 

 సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

IT Employees

వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌కే మా ఓటు 
ఈ ఏడాది మార్చి నెలలో లింక్డిన్‌ సర్వేలో 78 శాతం మంది ఇండియన్‌ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళుతున్నారు. ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో చాలా మంది ఇంట్లో ఉండి పనిచేయడం కంటే ఆఫీస్‌లో పనిచేయడం వల్ల ఉత్పాదక పెరగుతున్నట్లు సర్వే పేర్కొంది. చివరిగా.. మహమ్మారితో ఆకస్మికంగా పనిలో వచ్చిన మార్పులు ఆనందాన్ని దూరం చేసినట్లు 62శాతం మంది ఉద్యోగులు భావిస్తుండగా.. రిమోట్/హైబ్రిడ్ వర్క్‌ కల్చర్‌ రానున్న రోజుల్లో ఉద్యోగులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయోనని టెక్నాలజీ నిపుణులు చర్చించుకుంటున్నారు.

Published date : 15 May 2023 01:29PM

Photo Stories