Bad News To IT Employees: అయ్యో పాపం... చేరిన ప్రతీ కంపెనీలోనూ మొండిచేయే...
బిజినెస్ ఇన్‌సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్‌లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్‌కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్‌లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది.
చదవండి: 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్‌బాక్స్ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్‌డాక్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.
చదవండి: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యమిదే..
తన లేఆఫ్స్ గురించి పనెన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్‌తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: ఆ ఐదు యూనివర్సిటీలు హాట్ ఫేవరెట్... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్
టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్, గూగుల్ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.