TS Gurukul Recruitment 2023 : 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ ఏప్రిల్ 5వ తేదీన నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం తథ్యం..
దరఖాస్తు ఇలా.. :
ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 12వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
13వేలకు పైగానే ఉద్యోగాలను..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి 123 గురుకుల పాఠశాలలు ఉండగా, వాటిని 1011 లకు పెంచింది. అంతేగాకుండా వాటిని క్రమంగా పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, డిగ్రీ స్థాయికి విస్తరించుకుంటూ పోతున్నది. ఈ క్రమంలో ఆయా గురుకులాల్లో శాశ్వత ప్రతిపాదికన పోస్టుల భర్తీని క్రమంగా చేపడుతున్నది. మూడేళ్ల క్రితమే ఆయా గురుకులాల్లో 10వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, తాజాగా అంతేకు మించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా ప్రభుత్వం తొలుత 9096పోస్టులను ఖాళీలుగా గుర్తించింది.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
మరో 33 బీసీ గురుకులాలు, 15డిగ్రీ కళాశాలల మంజూరు చేయగా అందుకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో మరో 3 వేల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, మొత్తంగా బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి 13,530 పోస్టులను ఖాళీలుగా గుర్తించడంతోపాటు అందుకు ప్రభుత్వం అమనుతి సైతం మంజూరు చేసింది. తాజాగా వాటి భర్తీకి ట్రిబ్ చర్యలు చేపట్టింది.
మరో వారం రోజుల్లో 1000 పోస్టులకు నోటిఫికేషన్ :
13,675 పోస్టుల్లో గ్రూప్3, గ్రూప్ 4 పోస్టుల మినహా మిగతా 10,675 పోస్టుల భర్తీని ట్రిబ్ ద్వారా చేపట్టనున్నారు. అందులో తొలిదఫాగా ప్రస్తుతం 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి అందులో కొన్ని కొత్తగా, మెస్ ఇన్‌చార్జి, మరికొన్ని పోస్టులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉంది. అది కాకుండా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించి మరో వారం రోజుల్లో మిగిలిన పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
9231 పోస్టులు కేటగిరి వారీగా ఇలా..
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | |
1. | డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ | 868 |
2. | జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ | 2008 |
3. | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 1276 |
4. | ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) | 4090 |
5. | లైబ్రేరియన్ స్కూల్ | 434 |
6. | ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ | 275 |
7. | డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ | 134 |
8. | క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
9. | మ్యూజిక్ టీచర్స్ | 124 |
మొత్తం ఖాళీలు | 9231 |
9231 ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..