Skip to main content

TCS Salary Hikes 2024: టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్‌ 1 నుంచి..

TCS Salary Hikes 2024   Tata Consultancy Services   Salary Increase Announcement  Performance Evaluation

దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్‌లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్‌లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు.

"క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్‌ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్‌లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్‌ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ  ప్రకటనలో పేర్కొన్నారు.

Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌

 

గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్‌ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు.

కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్‌లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది.

Published date : 13 Apr 2024 04:13PM

Photo Stories