Skip to main content

IT Employees: 39,243 మంది ఉద్యోగుల‌ను తొలగించిన ప్రముఖ టెక్ కంపెనీలు ఇవే..

భారతదేశపు ప్రముఖ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులలో భారీ కోతలకు తెరతీశాయి.

ఇన్ఫోసిస్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది 2001 తరువాత కంపెనీ ఒకే సంవత్సరంలో ఇంత మంది ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: గత వారం తన Q4 ఫలితాలను వెల్లడించింది. 13,249 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలిపింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి. 

కారణాలు:

  • వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల.
  • కరోనా మహమ్మారి ప్రభావం.
  • ఐటీ రంగంలో పోటీ పెరుగుదల.

ఇతర ముఖ్య విషయాలు:

  • ఇన్ఫోసిస్ Q4 లాభాలు 30% పెరిగి రూ.7969 కోట్లకు చేరాయి.
  • TCS Q4 లాభాలు 6.5% పెరిగి రూ.11,043 కోట్లకు చేరాయి.
  • ఇన్ఫోసిస్ జనవరి-మార్చి త్రైమాసికంలో 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంది.
  • TCS జనవరి-మార్చి త్రైమాసికంలో 1,759 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంది.

కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.

Tech Jobs: ఐటీ జాబ్‌ కోసం వేచిచూస్తున్న వారికి శుభవార్త.. పుంజుకోనున్న నియామకాలు!!

Published date : 19 Apr 2024 06:22PM

Photo Stories