KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 13వేలకుపైగా కొలువులు.. విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 పోస్ట్‌లకు నోటిఫికేషన్
- టీచింగ్ విభాగంలో ప్రైమరీ, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు
- నాన్-టీచింగ్ విభాగంలో ఏసీ నుంచి లైబ్రేరియన్ వరకు పలు పోస్ట్‌లు
- రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం
కేంద్రీయ విద్యాలయాలు.. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థలు. వీటి పర్యవేక్షణ కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్ విధానంతో అత్యున్నత ప్రమాణాలతో బోధిస్తూ.. ప్రత్యేక గుర్తింపు పొందాయి కేంద్రీయ విద్యాలయాలు. ప్రస్తుతం దేశంలో 1,252, విదేశాల్లో మరో మూడు పాఠశాలలు ఉన్నాయి.
మొత్తం 13,404 పోస్ట్‌లు
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం- టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాలకు సంబంధించి మొత్తం 13,404 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
చదవండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
టీచింగ్ పోస్టులు
- ప్రైమరీ టీచర్స్-6,414, ప్రైమరీ టీచర్(మ్యూజిక్)-303.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్-1409 (హిందీ-172; ఇంగ్లిష్-158; ఫిజిక్స్-135; కెమిస్ట్రీ-167; మ్యాథ్స్-184; బయాలజీ-151; హిస్టరీ-63; జాగ్రఫీ-70; ఎకనామిక్స్-97; కామర్స్-66; కంప్యూటర్ సైన్స్-142; బయో టెక్నాలజీ-4).
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్-3,176(హిందీ-377; ఇంగ్లిష్-401; సంస్కృతం-245; సోషల్ స్టడీస్-398; మ్యాథమెటిక్స్-426; సైన్స్-304; ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్-435; ఆర్ట్ ఎడ్యుకేషన్-251; వైర్‌లెస్ ఇంజనీరింగ్-339).
అర్హతలు, వేతన శ్రేణి
- ప్రైమరీ టీచర్స్: ఇంటర్మీడియెట్‌తోపాటు 50 శాతం మార్కులతో డీఈడీ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు సీటెట్ పేపర్-1లో అర్హత సాధించాలి. వయసు: 30ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400-రూ.1,12,400
- ప్రైమరీ టీచర్స్-మ్యూజిక్: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400-రూ.1,12,400
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: సంబంధిత సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.47,600-రూ.1,51,100
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్: సంబంధిత సబ్జెక్ట్‌తో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీ పూర్తిచేయడంతోపాటు సీటెట్ పేపర్-2లో అర్హత సాధించాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-రూ.1,42,400
చదవండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
నాన్-టీచింగ్ పోస్ట్‌లు, అర్హతలు
- అసిస్టెంట్ కమిషనర్(52 పోస్ట్‌లు); అర్హత: 45 శా తం మార్కులతో పీజీతోపాటు, బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రిన్సిపల్ హోదాలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.78,800-రూ.2,09,200
- ప్రిన్సిపల్(239 పోస్ట్‌లు); అర్హత: 45 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఎనిమిదేళ్ల వ్యవధిలో పీజీటీ లేదా వైస్ ప్రిన్సిపల్ హోదాలో అనుభవం. వయసు: 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. వేతన శ్రేణి: రూ.78,800-రూ.2,09,200
- వైస్ ప్రిన్సిపల్(203 పోస్ట్‌లు); అర్హత: 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. వైస్ ప్రిన్సిపల్ హోదాలో రెండేళ్లు లేదా పీజీటీ/లెక్చరర్ హోదాలో ఆరేళ్లు లేదా పీజీటీ/టీజీటీ/లెక్చరర్ హోదాల్లో కలిపి పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35-45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతన శ్రేణి: రూ.56,100-1,77,500
- లైబ్రేరియన్(355 పోస్ట్‌లు); అర్హత: లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-1,42,400
- ఫైనాన్స్ ఆఫీసర్(6 పోస్ట్‌లు); అర్హత: 50 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత తోపాటు ఆడిట్ అండ్ అకౌంట్స్ వర్క్స్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. లేదా 50 శాతం మార్కులో ఎంకాం ఉత్తీర్ణతతోపాటు ఆడిట్ అండ్ అకౌంట్స్ వర్క్స్‌లో మూడేళ్ల అనుభవం లేదా సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్)/ఎంబీఏ(ఫైనాన్స్) లేదా పీజీడీఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతోపాటు ఆడిట్ అండ్ అకౌంట్స్ వర్క్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-1,42,400
- అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్-2 పోస్ట్‌లు); అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ. 44,900-1,42,400
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(156 పోస్ట్‌లు); అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాఖలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో యూడీసీ హోదాలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ. 35,400 -1,12,400
- హిందీ ట్రాన్స్‌లేటర్(11 పోస్ట్‌లు); అర్హత: హిందీ/ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌తో పీజీ ఉతీర్ణత ఉండాలి. దీంతోపాటు అభ్యర్థులు పీజీలో హిందీ లేదా ఇంగ్లిష్‌ను ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా చదివుండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400 -1,12,400
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(322 పోస్ట్‌లు); అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ శాఖలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్‌డీసీ హోదాలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.25,500 -81,100
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(702 పోస్ట్‌లు); అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్కిల్ ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.19,900-రూ.63,200
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(54 పోస్ట్‌లు); అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 27ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.25,500 -81,100.
తొలి దశ రాత పరీక్ష
- అన్ని పోస్ట్‌లకు సంబంధించి తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ముందుగా టీచింగ్ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్ష వివరాలు..
- ప్రైమరీ టీచర్స్: ఈ పోస్ట్‌లకు 180 మార్కులకు నాలుగు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. పార్ట్-1(జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు; జనరల్ హిందీ-10 ప్రశ్నలు); పార్ట్-2 (జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్-10 ప్రశ్నలు; రీజనింగ్ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్-3(అండర్ స్టాండింగ్ ద లెర్నర్-15 ప్రశ్నలు; అండర్ స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్-15 ప్రశ్నలు; క్రియేటింగ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్-10 ప్రశ్నలు, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్‌షిప్-10 ప్రశ్నలు; పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్-10 ప్రశ్నలు); పార్ట్-4 సంబంధిత సబ్జెక్ట్(80 ప్రశ్నలు).
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: ఈ పరీక్ష కూడా 180 మార్కులకు జరుగుతుంది. పార్ట్-1(జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు; జనరల్ హిందీ-10 ప్రశ్నలు), పార్ట్-2(జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్-10 ప్రశ్నలు; రీజనింగ్ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్-3(అండర్ స్టాండింగ్ ద లెర్నర్-15 ప్రశ్నలు; అండర్ స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్-15 ప్రశ్నలు; క్రియేటివ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్‌షిప్, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్-10 ప్రశ్నలు); పార్ట్-4 సంబంధిత సబ్జెక్ట్-100 ప్రశ్నలు.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్: ఈ పోస్ట్‌ల రాత పరీక్షకు కేటాయించిన మార్కులు 180. పార్ట్-1(జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు; జనరల్ హిందీ-10 ప్రశ్నలు); పార్ట్-2 (జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్-10 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్-3 (అండర్‌స్టాండింగ్ ద లెర్నర్-10 ప్రశ్నలు, అండర్‌స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్-15 ప్రశ్నలు; క్రియేటివ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్‌షిప్, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్-15 ప్రశ్నలు); పార్ట్-4 సంబంధిత సబ్జెక్ట్-100 ప్రశ్నలు.
డెమో, ఇంటర్వ్యూ ఇలా
- కేంద్రీయ విద్యాలయాల్లో భర్తీ చేయనున్న అన్ని పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ పేరుతో తదుపరి దశలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటికి నిర్దిష్టంగా మార్కులు కూడా కేటాయిస్తారు.
- పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, లైబ్రేరియన్ పోస్ట్‌లకు 60 మార్కులకు(డెమోకు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు) నిర్వహిస్తారు.
- నాన్ టీచింగ్ పోస్ట్‌లకు సంబంధించి కూడా రాత పరీక్షతోపాటు అసిస్టెంట్ కమిషన్ పోస్ట్‌లకు 20 మార్కులకు ఇంటర్వ్యూ; ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌లకు 30 మార్కులకు ఇంటర్వ్యూతోపాటు, మరో 30 మార్కులకు స్కూల్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రజెంటేషన్‌కు కేటాయిస్తారు.
- హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్ట్‌లకు 90 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఇంటర్వ్యూ ఉండదు.
వెయిటేజీ విధానంలో తుది ఎంపిక
కేంద్రీయ విద్యాలయ పోస్ట్‌ల తుది విజేతల ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. టీచింగ్ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభకు 70 మార్కులు; డెమో, ఇంటర్వ్యూలలో ప్రతిభకు 30 మార్కుల వెయిటేజీని నిర్దేశించారు. నాన్ టీచింగ్ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభకు 80 మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభకు 20 మార్కులు వెయిటేజీని నిర్ధారించారు. అభ్యర్థులు ఈ రెండు విభాగాల్లో పొందిన మార్కులను గణించి తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.
చదవండి: TS TET Previous Papers-2022
సబ్జెక్ట్ నుంచి సమకాలీనం వరకు
- ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్షలో విజయానికి సబ్జెక్ట్ నాలెడ్జ్, విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్-కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
- చైల్డ్ సైకాలజీ, కరిక్యులమ్ ఆర్గనైజేషన్, లెసన్ ప్లాన్, ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్స్, విద్యా దృక్పథాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- నాన్-టీచింగ్ పోస్ట్‌ల అభ్యర్థులు తమ విభాగాలకు సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అభ్యసనం చేయాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 26, 2022.
- రాత పరీక్ష: 2023, మే నెలలో నిర్వహించే అవకాశం.
- వెబ్‌సైట్: https://www.kvsangathan.nic.in/
చదవండి: టెట్ ప్రిపరేషన్ గైడెన్స్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 26,2022 |
Experience | 2 year |
For more details, | Click here |