Assistant Professor Posts: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: అనెస్తీషియాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో థెరపీ తదితరాలు.
అర్హత: సంబం«ధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ /ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్ మెంట్ సెల్, సెకండ్ ఫ్లోర్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, గేట్ నెం.5, ఎయిమ్స్ రాయ్‌పూర్, జి.ఈ.రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్(సి.జి) పిన్–492099 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 21.09.2021
వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in/
Qualification | POST GRADUATE |
Last Date | September 14,2021 |
Experience | 1 year |
For more details, | Click here |