Skip to main content

BARC Recruitment 2022: బార్క్, ముంబైలో 266 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

BARC Mumbai Recruitment

ముంబైలో ఉన్న బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) పరిధిలోని న్యూక్లియర్‌ రీసైకిల్‌ బోర్డుల్లో(తారాపూర్, కల్పకం) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 266
పోస్టుల వివరాలు: స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి1–71, స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి2–189, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి(సేఫ్టీ)–01,టెక్నీషియన్‌ బి(లైబ్రరీ సైన్స్‌)–01, టెక్నీషియన్‌ బి(రిగ్గర్‌)–04.

స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరీ–1: 
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌. 
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.16,000, రెండో ఏడాది నెలకు రూ.18,000 చెల్లిస్తారు.

స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి–2: 
ట్రేడులు: ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్‌ ఆపరేటర్‌ తదితరాలు. 
అర్హత: కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ పోస్టులకు కనీసం 60శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–22 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి(సేఫ్టీ): 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌–బి(లైబ్రరీ సైన్స్‌):
అర్హత: పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులవ్వాలి. లైబ్రరీ సైన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌–బి(రిగ్గర్‌): 
అర్హత: పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులవ్వాలి. రిగ్గర్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022

వెబ్‌సైట్‌: https://nrbapply.formflix.com
 

చదవండి:  ECIL Hyderabad Recruitment: ఐటీఐ అర్హత‌తో 1625 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date April 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories