Skip to main content

Intelligence Bureau Recruitment 2024: ఐబీలో 226 పోస్ట్‌లు.. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక

బీటెక్‌ పూర్తి చేసి గేట్‌లో స్కోర్‌ సాధించిన వారికి కొత్త సంవత్సరంలో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)–226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌–2 (టెక్నికల్‌) పోస్ట్‌ల భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కీలక శాఖలో కొలువుదీరే అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఐబీ ఏసీఐఓ గ్రేడ్‌–2/ టెక్నికల్‌ పోస్ట్‌ల నోటిఫికేషన్‌ సమాచారం, ఎంపిక విధానం తదితర వివరాలు..
Government Job for Engineers   Apply for ACIO-2 Technical Positions    Central Intelligence Bureau Job Opportunity  226 Technical Posts Available    Assistant Central Intelligence Officer-2 Recruitment   Intelligence Bureau Recruitment 2024 For Assistant Central Intelligence Officer Jobs
  • అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌–2(టెక్‌) నోటిఫికేషన్‌ 
  • మొత్తం 226 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ
  • బీటెక్, గేట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు అవకాశం
  • ఇంటర్వ్యూలో ప్రతిభతో తుది ఎంపిక

రెండు విభాగాలు.. 226 పోస్ట్‌లు
ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో తాజా నోటిఫికేషన్‌ ద్వారా రెండు విభాగాల్లో 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2/టెక్నికల్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో 79 పోస్ట్‌లు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో 147 పోస్ట్‌లు ఉన్నాయి. 

అర్హతలు

  • ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ /కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో బీఈ/  బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (లేదా) ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌తో పీజీ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ ఉత్తీర్ణత పొందాలి.
  • సంబంధిత బ్రాంచ్‌/సబ్జెక్ట్‌లో బీటెక్‌ లేదా ఎమ్మెస్సీతోపాటు గేట్‌–2021, 2022, 2023లో అర్హత సాధించాలి.
  • వయసు: జనవరి 12, 2024 నాటికి 18–27 ఏళ్లు (ఎస్‌సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు) ఉండాలి.

నెలకు లక్ష వేతనం
నియామకాలు ఖరారు చేసుకున్న అభ్యర్థులకు పే లెవల్‌–7 (రూ.44,900 – రూ.1,42,400 వేతన శ్రేణి)లో ప్రారంభ వేతనం లభిస్తుంది. మూల వేతనం రూ.44,900గా ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, ఎస్‌ఎస్‌ఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, డీఏ వంటి ఇతర భత్యాలు లభిస్తాయి. ఇలా.. మొత్తంగా నెలకు రూ.లక్ష వరకు నికర వేతనం పొందొచ్చు.

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గేట్‌ స్కోర్‌ ప్రామాణికం
2021, 2022, 2023లో గేట్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌(ఈసీ), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(సీఎస్‌) పేపర్లలో ఉత్తీర్ణతను దరఖాస్తుకు అర్హతగా పేర్కొన్నారు. వీరి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గేట్‌ స్కోర్‌ ఆధారంగా తదుపరి దశకు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూతో నియామకాలు
అభ్యర్థులు గేట్‌–2021, 2022, 2023లలో తమకు వచ్చిన బెస్ట్‌ స్కోర్‌తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 10 మందిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం 175 మార్కులు కేటాయించారు.

మెరిట్‌ జాబితా
ఫైనల్‌ మెరిట్‌ జాబితాను రూపొందించేందుకు.. గేట్‌ స్కోర్‌ను, ఇంటర్వ్యూలో పొందిన మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్, ఇతర నిబంధనలను అనుసరిస్తూ తుది నియామకాలు ఖరారు చేస్తారు.

ఇంటర్వ్యూ ఇలా
మొత్తం 175 మార్కులకు జరిపే పర్సనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా.. సైకోమెట్రిక్‌ టెస్టులు/ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు. ప్రధానంగా జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఇంటెలిజెన్స్‌ బ్యూరోపై ఉన్న అవగాహన, ఇంటెలిజెన్స్‌ బ్యూరో విధులు, దేశంలో శాంతి భద్రతలు తదితర విషయాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు.

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీ– ఏపీలో 21 అసిస్టెంట్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సబ్జెక్ట్‌ నైపుణ్యం
ఇంటర్వ్యూలో భాగంగా సబ్జెక్ట్‌ నైపుణ్యాలను కూడా పరిశీలిస్తారు. అభ్యర్థులు బీటెక్‌ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. అదే విధంగా.. సాంకేతిక నైపుణ్యాలను.. నిఘా విభాగంలో ఎలా ఉపయోగించొచ్చు? ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లలో టెక్నాలజీని అమలు చేస్తున్న తీరు? తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇంటెలిజెన్స్‌ బ్యూరో విధి విధానాలపై అవగాహన ఏర్పరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా.. అకడమిక్స్‌ కోణంలో తాము చేసిన ప్రాజెక్ట్‌ వర్క్స్, వాటి ద్వారా గుర్తించిన సమస్యలు, వాటికి కనుగొన్న పరిష్కారాలు, అవి ఉపయోగపడే తీరు వంటి వాటి గురించి పునరావలోకం చేసుకోవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

విధులు ఇలా
ఏఐసీఓ గ్రేడ్‌–2/టెక్నికల్‌గా నియమితులైన వారు.. నిఘా విభాగానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను సాంకేతికీకరణ చేసే విధంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నివేదికలు రూపొందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను వినియోగించడం, నిఘా విధులకు కీలకంగా నిలుస్తున్న కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ సాధనాల పనితీరును పర్యవేక్షించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

పదోన్నతితో డిప్యూటీ డైరెక్టర్‌
ఏసీఐఓ గ్రేడ్‌–2 హోదాలో నియమితులైన వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఏసీఐఓ గ్రేడ్‌–1గా పదోన్నతి లభిస్తుంది.ఆ తర్వాత ప్రతి హోదాకు ఆరు నుంచి ఎనిమిదేళ్ల కాల వ్యవధి ఆధారంగా.. డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, జాయింట్‌ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ వంటి హోదాలకు చేరుకోవచ్చు. 27 ఏళ్ల వయసులో కొలువులో చేరిన వారు పదవీ విరమణ సమయానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకోవచ్చు. అత్యున్నత ప్రతిభతో డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 12, 2024.
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/, https://www.ncs.gov.in/

చదవండి: Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories