SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1226 పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
ముంబైలో ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1226(రెగ్యులర్–1100, బ్యాక్‌లాగ్–126)
అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.12.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 ప్రశ్నలు–120 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021
వెబ్‌సైట్: https://sbi.co.in
చదవండి: IBPS Jobs: త్వరలో క్లర్క్, ఎస్‌వో పోస్టులకు పరీక్షలు.. సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ వివరాలు ఇలా..
Qualification | GRADUATE |
Last Date | December 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |