Skip to main content

Central Bank Jobs: 291 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. దేశంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నియంత్రించి, పర్యవేక్షించే కేంద్ర బ్యాంకు! ఇంతటి కీలక వ్యవస్థలో యువత పాల్పంచుకునే అవకాశం కల్పిస్తోంది ఆర్‌బీఐ! ఇందుకోసం గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది! బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఇటీవల కేంద్ర బ్యాంకు 291 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..
Central Bank Jobs
  • 291 గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌
  • బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ అర్హతతో పోటీ పడే అవకాశం
  • కొలువు సాధిస్తే..రూ.55,200 ప్రారంభ వేతనం
  • రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక

మూడు విభాగాలు.. 291 పోస్ట్‌లు

  • తాజా నియామక ప్రక్రియ ద్వారా బ్యాంకుకు చెందిన మూడు విభాగాల్లో 291 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. 
    ఆ వివరాలు..
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(జనరల్‌)-222 పోస్ట్‌లు.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌-డీఈపీఆర్‌) -38 పోస్ట్‌లు.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ -డీఐఎస్‌ఎం)-31 పోస్ట్‌లు.

చ‌ద‌వండి: Bank Exam Guidance

అర్హతలు

  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(జనరల్‌): 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ డీఈపీఆర్‌: క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌/మ్యాథమెటికల్‌ ఎకనామిక్స్‌ /ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌/ ఇండస్ట్రియల్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌తో ఎంఏ లేదా ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. (లేదా) ఫైనాన్స్‌ సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత లేదా పీజీడీఎం/ ఎంబీఏ పాసవ్వాలి. అన్ని కోర్సులకు సంబంధించి కనీసం 55 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ డీఐఎస్‌ఎం: స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ ఎకనామిక్స్‌/ఎకనోమెట్రిక్స్‌/స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సబ్జెక్ట్‌ స్పె­షలైజేషన్లతో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్, అదే విధంగా ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కోల్‌కతలలో పీజీడీబీఏలలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: మే 1, 2023 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

 చ‌ద‌వండి: Study Material

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ఆర్‌బీఐ గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్ట్‌ల నియామకానికి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అవి.. ఫేజ్‌-1 రాత పరీక్ష; ఫేజ్‌-2 రాత పరీక్ష; పర్సనల్‌ ఇంటర్వ్యూ.

మూడు విభాగాలకు వేర్వేరుగా

ఫేజ్‌-1, ఫేజ్‌-2లుగా నిర్వహించే రాత పరీక్ష మూడు విభాగాల(గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ -జనరల్, గ్రేడ్‌-బి ఆఫీసర్‌ డీఈపీఆర్, గ్రేడ్‌ బి ఆఫీసర్‌ డీఐఎస్‌ఎం)కు వేర్వేరుగా ఉంటుంది.

గ్రేడ్‌-బి ఆఫీసర్‌(జనరల్‌) రాత పరీక్షలు

  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(జనరల్‌) పోస్ట్‌లకు సంబంధించి ఫేజ్‌-1లో 200 మార్కులకు జనరల్‌ అవేర్‌నెస్,ఇంగ్లిష్‌ లాంగ్వేజ్,క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు లభించే సమయం రెండు గంటలు.
  • ఫేజ్‌-1 పరీక్షలో సెక్షన్ల వారీగా, మొత్తంగా నిర్దేశిత కటాఫ్‌ మార్కులను పొందిన వారితో మెరిట్‌ జాబితా రూపొందించి.. పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి తదుపరి దశలో ఫేజ్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.

మూడు వందల మార్కులకు ఫేజ్‌-2

  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌(జనరల్‌) పోస్ట్‌లకు రెండో దశ­లో నిర్వహించే ఫేజ్‌-2 రాత పరీక్ష.. మూడు పేపర్లలో మూడు వందల మార్కులకు ఉంటుంది. 
  • పేపర్‌-1 ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ ఇష్యూస్‌ 100 మార్కులు, పేపర్‌-2 ఇంగ్లిష్‌ రైటింగ్‌ స్కిల్స్‌ 100 మార్కులు, పేపర్‌-3 జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు జరుగుతుంది. 
  • పేపర్‌-1, పేపర్‌-3లలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో 1 మార్కు, రెండు మార్కులతో 30 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం 50 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
  • మరో 50 మార్కులకు వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మొత్తం ఆరు ప్రశ్నలు అడుగుతారు. వీటిలో కనీసం నాలుగింటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలకు 15 మార్కులు చొప్పున, మరో రెండు ప్రశ్నలకు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

 చ‌ద‌వండి: Bitbank

గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డీఈపీఆర్‌).. మూడు పేపర్లు

  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్ట్‌లకు తొలిదశలో రాత పరీక్ష, తదుపరి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తొలి దశ రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. -ప్రతి పేపర్‌కు 100 మార్కులు చొప్పున మొత్తం మూడు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పేపర్‌-1లో ఎకనామిక్స్‌ నుంచి ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌-2లో కూడా ఎకనామిక్స్‌ ఉంటుంది. ప్రశ్నలు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి.
  • పేపర్‌-3ని ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • పేపర్‌-1కు రెండు గంటలు, పేపర్‌-2 మూడు గంటలు, పేపర్‌-3కు గంటన్నర సమయం ఉంటుంది.
  • అభ్యర్థులు డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కంప్యూటర్‌పైనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

పేపర్‌-1లో అర్హత సాధిస్తేనే

గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డీఈపీఆర్‌)కు సంబంధించి పేపర్‌-1లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారికే పేపర్‌-2, పేపర్‌-3లకు అనుమతి లభిస్తుంది. ముందుగా పేపర్‌-1ను నిర్వహించి..కొద్ది రోజు­ల వ్యవధి తర్వాత పేపర్‌-2, 3లను నిర్వహిస్తారు.

గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డీఐఎస్‌ఎం).. స్టాటిస్టిక్స్‌ పేపర్లు

గ్రేడ్‌-బి ఆఫీసర్‌(డీఐఎస్‌ఎం) పోస్ట్‌ల ఎంపిక విధానం డీఈపీఆర్‌ గ్రేడ్‌-బి ఆఫీసర్‌ మాదిరిగానే ఉంటుంది. మూడు పేపర్లుగా మూడు వందల మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1, 2లలో స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌-3లో ఇంగ్లిష్‌ విభాగం ఉంటుంది. -పేపర్‌-1ను ఆబ్జెక్టివ్‌ విధానంలో, పేపర్‌-2, పేపర్‌-3లను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. -పేపర్‌-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకే పేపర్‌-2, పేపర్‌-3లకు అర్హత కల్పిస్తారు.

ఇంటర్వ్యూకు 75 మార్కులు

మూడు విభాగాల పోస్ట్‌ల(జనరల్, డీఈపీఆర్, డీఐఎస్‌ఎం)కు సంబంధించి రాత పరీక్షల్లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వారికి చివరి దశలో 75 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ కంటే ముందు సైకోమెట్రిక్‌ టెస్ట్‌ను కూడా నిర్వహించే అవకాశముంది. 

ఆకర్షణీయ వేతనం

అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనంతో కెరీర్‌ ప్రారంభం అవుతుంది. రూ.55,200- రూ.99,750 వేతన శ్రేణి లభిస్తుంది. వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఫ్యామిలీ అలవెన్స్, గ్రేడ్‌ అలవెన్స్‌ వంటివి కూడా అందుతాయి. 

 చ‌ద‌వండి: Previous Papers

పీజీ స్థాయి ప్రిపరేషన్‌

  • ఆర్‌బీఐ గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షల్లో మెరుగైన స్కోర్‌ సాధించడానికి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న పోస్ట్, అందుకు నిర్దేశించిన సబ్జెక్ట్‌లకు సంబంధించి పీజీ స్థాయిలో పూర్తి స్థాయి అకడమిక్‌ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. 
  • ఆర్థిక, సామాజిక అంశాలు, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇండియన్‌ ఎకానమీ, గ్లోబలైజేషన్,భారత సామాజిక విధానం, ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు, ఆర్‌బీఐ విధులు, దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఫైనాన్షియల్‌ మార్కెట్స్, పీపీపీ, కార్పొరేట్‌ గవర్నెన్స్, బడ్జెట్, ద్రవ్యోల్బణం, ఫిన్‌టెక్, మేనేజ్‌మెంట్‌ ప్రాథమిక అంశాలు, లీడర్‌షిప్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ డీఈపీఆర్‌ అభ్యర్థులు పీజీ స్థాయిలో ఎకనామిక్స్‌ పుస్తకాలతోపాటు ఆర్‌బీఐ ప్రచురణలు,వార్షిక నివేదికలు,బ్యాంకింగ్‌ రంగం తీరుపై విడుదలవుతున్న నివేదికలు, ద్రవ్య విధా­నం, ఎకనామిక్‌ సర్వేలను అధ్యయనం చేయాలి.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ డీఐఎస్‌ఎం అభ్యర్థులు ప్రాబబిలిటీ, స్టాండర్డ్‌ డిస్ట్రిబ్యూషన్, శాంపిల్‌ థియరీ, ఎస్టిమేషన్, అనాలిసిస్‌ ఆఫ్‌ వేరియన్స్, టెస్టింగ్‌ ఆఫ్‌ హైపోథిసెస్, లీనియర్‌ మోడల్స్‌ అండ్‌ ఎకనామిక్‌ స్టాటిస్టిక్స్, న్యూమరికల్‌ అనాలిసిస్‌ అండ్‌ బేసిక్‌ కంప్యూటర్‌ టెక్నిక్స్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
  • ఇంగ్లిష్‌కు సంబంధించి కాంప్రహెన్షన్, రీడింగ్, ప్యాసేజ్‌లను అర్థం చేసుకోవడం, భావ వ్యక్తీకరణలపై దృష్టి పెట్టాలి.
  • గ్రేడ్‌-బి ఆఫీసర్‌ జనరల్‌.. పేపర్‌-1లో ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం స్టాక్‌ జీకే అంశాలు, కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌ అంశాలను పూర్తి స్థాయిలో చదవాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో అర్థమెటిక్‌ సంబంధిత అంశాలు(రేషియోస్, పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ వర్క్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, రిలేషన్స్‌ తదితర)పై అవగాహన పొందాలి. రీజనింగ్‌కు సంబంధించి కోడింగ్, డీ-కోడింగ్, సిలాజిజమ్, నంబర్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మే 9-జూన్‌ 9, 2023
  • ఆఫీసర్‌ డీఈపీఆర్, డీఐఎస్‌ఎం పరీక్ష కేంద్రాలు: హైదారాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

చ‌ద‌వండి: RBI Recruitment 2023: ఆర్‌బీఐ, ముంబైలో 291 ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories