Skip to main content

APPSC Group 1 Ranker 2022 Success Story : ఆన్‌లైన్‌లో ప్రిప‌రేష‌న్‌.. మొదటి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్‌-1 కొట్టానిలా.. నా ల‌క్ష్యం ఇదే..

టార్గెట్ చిన్నాదా.. పెద్దదా.. అనేది ముఖ్యం కాదు. చివ‌రికి సాధించామా.. లేదా అనేది ముఖ్యం. ఇదే క్ర‌మంలో ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) ప్ర‌క‌టించిన గ్రూప్‌-1 ఫ‌లితాల్లో అన్న‌మ‌య్య జిల్లాకు చెందిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో ఈ విజేత‌ల స‌క్సెస్ స్టోరీ మీకోసం..
Andhra Pradesh District Victories ,APPSC Group 1 Ranker Success Story in Telugu ,APPSC Group-1 Results Showcase Success,
APPSC Group 1 Ranker 2022 Success

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే.. సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని గ్రూప్‌ 1 విజేత పోతుగుంట జయశ్రీ అన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. పట్టణ పరిధిలోని ఎగువ బసినాయుడుగారిపల్లికి చెందిన పోతుగుంట నాగేశ్వరనాయుడు, నాగలక్ష్మిల ఏకైక కుమార్తె జయశ్రీ.

☛ Three Sisters Government Jobs Success : చదువుల మ‌హారాణులు.. అక్క డీఎస్పీ.. చెల్లెలు డిప్యూటీ క‌లెక్ట‌ర్.. మ‌రో చెల్లెలు కూడా..

ఈమె 1వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు రాజు హైస్కూల్‌లో, ఇంటర్‌ హైదరాబాదులోని శ్రీచైతన్య ఐఏఎస్‌ అకాడమిలో, డిగ్రీ ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో, ఎంఏ హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. 

మొదటి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్‌-1.. నా ల‌క్ష్యం ఇదే..

appsc group 1 ranker story in telugu

మొదటి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్‌–1 పరీక్షలు రాసి విజ‌యం సాధించారు. ఐఏఎస్‌ కావటం తన ఆశయం అని ఆమె వెల్లడించారు. జయశ్రీ ఎంపీడీఓగా ఎంపిక కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రూప్‌-2 టూ గ్రూప్‌-1 అధికారిగా..
సిద్దవటం మండలంలోని బొగ్గిడివారిపల్లె గ్రామానికి చెందిన గజ్జల సురేంద్రారెడ్డి గ్రూప్‌–1 పాసై వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమీషనర్‌గా ఎంపికయ్యారు. ఈయన ఎమ్మెస్సీ పూర్తి చేసి 2018లో గ్రూప్‌–2 విభాగంలో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. తాజాగా గ్రూప్‌–1 ఫలితాల్లో వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమీషనర్‌గా ఎంపిక కావంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రూప్‌–1 ఫలితాల్లో రాయచోటికి చెందిన రామాపురం హరిత అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారిగా ఎంపికయ్యారు. పట్టణంలో నివాసముంటున్న టీచర్‌ జయరామరాజు, భారతిల కుమార్తె హరిత. 

☛ APPSC Group-1 Ranker Success : ఆ బ‌డికి వెళ్లాలంటే.. భ‌యం.. ఆ చిన్న‌ పూరి గుడిసెలో చ‌దువు.. చివ‌రికి గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..

ఈమె టెన్త్‌ వరకు పట్టణంలోని రాజుస్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. సచివాలయ సెక్రెటరీగా ఎంపికై ఏడాది పాటు ఆమె ఉద్యోగం చేసింది. ప్రస్తుతం గ్రూప్‌–1లో విజయం సాధించింది. సివిల్స్‌లో రాణించడమే తన లక్ష్యమంటోంది. హరితకు తోటి మిత్రులు, బంధువులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

 ఏపీపీఎస్సీ గ్రూప్స్ స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, విజేతల అనుభవాలు, సలహాలు.. ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో ప్రిప‌రేష‌న్‌.. మొదటి ప్రయత్నంలోనే.. స‌క్సెస్ :
అన్న ప్రోత్సాహంతో తాను గ్రూప్‌–1 ఫలితాల్లో ప్రతిభ చాటినట్లు మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మాకినేని పవిత్ర తెలిపారు. గ్రూప్‌–1 ఫలితాల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (ఏటిఓ)గా ఎంపికయ్యారు. తండ్రి ప్రభాకర్‌నాయుడు వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి లక్ష్మిదేవి గృహిణి. అన్న పురుషోత్తం సూచన మేరకు ఆన్‌లైన్‌లో ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచింది.

☛ APPSC Group1 Ranker Interview : APPSC Group 1కి ఇలా చ‌దివా.. పుస్త‌కాల ఎంపిక‌లో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

పదో తరగతి స్థానిక జ్ఞానోదయ పాఠశాల, ఇంటర్మీడియట్‌ సిద్దార్థ కాలేజీ, బిటెక్‌ మిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈసీఈ చేసింది. కలెక్టర్‌ కావాలన్నదే తన ధ్యేయమని పవిత్ర తెలిపింది.

☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా స‌క్సెస్‌ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే.. (Click Here)

Published date : 26 Aug 2023 10:42AM

Photo Stories