TSPSC Group 1 Mains : గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో తండ్రీ కొడుకులు పాస్.. మెయిన్స్‌కు ఇలా..
బాలనర్సయ్య ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.
సచిన్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు.
Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
52 ఏళ్ల రవికిరణ్ కూడా కుమాడుడితో పాటు..
ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల్లో రవికిరణ్ సత్తాచాటారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యుడిగా పనిచేస్తూ తన కుమారుడితో పాటు చదువుకుంటూ గ్రూప్ 1 కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్న దాసరి రవికిరణ్(52), ఆయన కుమారుడు మైఖేల్ ఇమ్మాన్యుయేల్(24) ఇద్దరూ ఒకేసారి ప్రిలిమ్స్‌కు అర్హత సాధించారు.
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
మైఖేల్ దూరవిద్య ద్వారా డిగ్రీ చేశారు. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడికి సహకారం అందిస్తూ సందేహాలు తీరుస్తూ తండ్రి కూడా చదివారు. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాసి అర్హత సాధించారు. రిజర్వేషన్ కోటాలో అయిదేళ్లు, ఇన్ సర్వీస్ కోటాలో అయిదేళ్ల మినహాయింపు ఉండటంతో 52 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్1 పరీక్షకు అర్హుడయ్యారు.