Skip to main content

Three Sisters Government Jobs Success : చదువుల మ‌హారాణులు.. అక్క డీఎస్పీ.. చెల్లెలు డిప్యూటీ క‌లెక్ట‌ర్.. మ‌రో చెల్లెలు కూడా..

ఈ కుటుంబంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల పంట పండింది. వీళ్ల విజ‌యం వెనుక ఎంతో క‌ష్టం ఉంది. వీళ్లు తండ్రి కష్టాన్ని కళ్లారా చూశారు. అలాగే తల్లి పడే తపనను దగ్గరుండి గమనించారు. చదువే ఆభరణమని గుర్తించి అహర్నిశలు శ్రమించారు. ఒకరిద్దరు కాదూ ముగ్గురూ విద్యావంతులయ్యారు.
APPSC Group 1 Rankers Three Sisters Success Story in Telugu
Three Sisters Success Story

ఒకరు డీఎస్పీగా.. మరొకరు డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. వీరే.. ల‌క్ష్మీప్రసన్న, మాధవి, లావణ్యలక్ష్మీ. వీళ్ల ల‌క్ష్మీప్రసన్న గారు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 తుది ఫ‌లితాల్లో రాష్ట్ర‌స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు.

కుటుంబ నేప‌థ్యం :  

APPSC Group 1 Ranker Success Story

అన్న‌మ‌య్య జిల్లా నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంకు చెందిన వారు వీరు. వీరి తండ్రి కంభాలకుంట సుబ్బరాయుడు. త‌ల్లి సరస్వతి. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. 

తొలి అడుగులోనే..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్‌ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు.

☛ APPSC Group-1 Ranker Success : ఆ బ‌డికి వెళ్లాలంటే.. భ‌యం.. ఆ చిన్న‌ పూరి గుడిసెలో చ‌దువు.. చివ‌రికి గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..

డీఎస్పీగా తొలి పోస్టింగ్‌..
లావణ్యలక్ష్మీ..టంగుటూరు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. 2009లో గ్రూప్‌–1 విజేతగా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్‌ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్‌ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు.

☛ APPSC Group1 Ranker Interview : APPSC Group 1కి ఇలా చ‌దివా.. పుస్త‌కాల ఎంపిక‌లో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

మాధవి.. అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్‌ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు.

ల‌క్ష్మీప్రసన్న.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి..

APPSC Group 1 Ranker Success Story in Telugu

అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్‌–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్‌ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె. ఇంటర్‌ తిరుపతిలోని శ్రీ చైతన్యలో పూర్తి చేశారు. అలాగే ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్‌–1కు ప్రిపేర్‌ అయ్యారు. ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ తీసుకున్నారు.  ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాక‌ల్టీ ఇచ్చిన ఉత్త‌మ శిక్ష‌ణ‌తో.. రాష్ట్ర‌స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు.

☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా స‌క్సెస్‌ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే.. (Click Here)

నా ల‌క్ష్యం ఇదే..
ల‌క్ష్మీ ప్రసన్న.. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈమె సివిల్స్‌ కోసం ఢిల్లీలో కూడా శిక్ష‌ణ తీసుకున్నారు.

మా కలలను బిడ్డలు నిజం చేశారు.. నేడు మాకు.. : తల్లి సరస్వతి

APPSC Group 1 Success Stories 2023

నేను ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నాం. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. 

ల‌క్ష్మీప్రసన్న(డిప్యూటీ క‌లెక్ట‌ర్) సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌కి ఇచ్చిన పూర్తి ఇంట‌ర్వ్యూ మీకోసం..

ఏపీపీఎస్సీ గ్రూప్స్ స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, విజేతల అనుభవాలు, సలహాలు.. ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

Published date : 25 Aug 2023 04:28PM

Photo Stories