Skip to main content

APPSC Group 1 Ranker Success : గ్రూప్‌-1 ఉద్యోగానికి సెల‌క్ట్ అయ్యానిలా.. ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఇటీవ‌లే విడుద‌ల చేసిన 2022 గ్రూప్‌-1 ఫ‌లితాల్లో చాలా యువ‌తి యువ‌కులు త‌మ స‌త్తాచాటురు. అలాగే ఈ గ్రూప్‌-1 ఫ‌లితాల్లో చాలా మంది పేదింటి బిడ్డ‌లు తమ స‌త్తాచాటి.. త‌ల్లిదండ్రుల కలను సాకారం చేశారు.
Success for Underprivileged Youth, APPSC Group 1 Ranker Gowtham Success Story Telugu,Group-1 Results 2022
APPSC Group 1 Ranker Success Story

ఈ నేప‌థ్యంలో నంద్యాల పట్టణం రైతు నగరానికి చెందిన లక్కాకుల గౌతమ్ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు.

☛ APPSC Group 1 Ranker : గ్రూప్‌-1, 2 రెండూ ఉద్యోగాలు కొట్టానిలా..

ఈ మాటలే న‌న్ను కదిలించాయి..
గౌతమ్.. నాన్న పోలీస్‌ ఉద్యోగం చేస్తున్నారు. డిగ్రీ చదివే రోజుల్లో ఆ యువకుడు నాన్న వెంట పోలీసుస్టేష‌న్‌కు వెళ్లేవారు. సాధించే ఉద్యోగం పదిమందికి సేవచేసేదైతే జన్మ సార్థకమవుతుందని అక్కడ డీఎస్పీ చెప్పిన మాటలు కదిలించాయి. అది సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగమైతే వేలాది మందికి సేవలందించే అవకాశం ఉంటుందన్న డీఎస్పీ మాటలు ఆ యువకుడిలో కొత్త ఆలోచనలు పుట్టించాయి. పట్టుదలను పెంచాయి... ఆ మాటలే వేదవాక్కయ్యాయి. అప్పటి నుంచే కార్యాచరణలోకి దిగారు. సాధిస్తే సివిల్స్‌ సాధించాలి.. లేకపోతే గ్రూప్స్‌లో నిలబడాలని నిర్ణయించుకున్న ఆ యువకుడి కల సాకారమైంది.

☛ APPSC Group 1 Ranker Gnanananda Reddy Success : గ్రూప్‌-1లో విజ‌యం సాధించానిలా.. మా నాన్న కోసం ఎలాగైన‌ ఈ లోటును భ‌ర్తీ చేస్తా..

కుటుంబ నేప‌థ్యం : 
గౌతమ్ తండ్రి.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లిపల్లి గ్రామానికి చెందిన లక్కాకుల వెంకటేశ్వర్లు. ఈయ‌న‌ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వలస వచ్చారు. డోన్‌లో స్థిరపడిన గౌతమ్‌ తండ్రి వెంకటేశ్వర్లు అప్ప‌ట్లో పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై.. నంద్యాల పట్టణం రైతు నగరంలో స్థిరపడ్డారు. ఈయన రెండో కుమారుడే గౌతమ్‌.

 APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భ‌య‌టప‌డ్డానిలా.. ఎన్నో వివ‌క్ష‌త‌లు ఎదుర్కొంటూనే గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

ఎడ్యుకేష‌న్ : 
గౌతమ్.. ఇంటర్‌ విజయవాడలో, డిగ్రీ హైదరాబాద్‌లో చదివారు. 2015లో డిగ్రీ పూర్తిచేసిన గౌతమ్‌ న్యూఢిల్లీకి వెళ్లారు. 

ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం ఇదే..
న్యూఢిల్లీలో ఓ సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ కేంద్రంలో చేరి మూడేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. అయిదు సార్లు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాస్తే మూడు సార్లు మెయిన్స్‌ వరకు వెళ్లారు. ఫలితం రాలేదు. రెండేళ్ల క్రితం సీఐఎస్‌ఎఫ్‌కు ఎంపికై ఝార్ఖండ్‌లో కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్‌ 1 సాధించినా నా లక్ష్యం ఐఏఎస్‌, ఐపీఎస్‌. దీని కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డి ఎప్ప‌టికైన ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధిస్తాన‌ని ధీమా చెప్పుతున్నారు.

 APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భ‌య‌టప‌డ్డానిలా.. ఎన్నో వివ‌క్ష‌త‌లు ఎదుర్కొంటూనే గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

Published date : 19 Oct 2023 07:40AM

Photo Stories