APPSC Group 1 Ranker : జూనియర్ అసిస్టెంట్..టూ.. గ్రూప్–1 స్థాయి ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
అలాగే తాను అనుకున్నట్టే.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం సాధించింది. ఈమే నెల్లూరు జిల్లా కొత్తూరుకు చెందిన రుధిర. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ర్యాంకర్ రుధిర సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
రుధిర.. తండ్రి పద్మనాభరావు. తల్లి శాంతికుమారి. తల్లి గతంలో పొదలకూరు రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేశారు.
ఎడ్యుకేషన్ :
రుధిర.. పొదలకూరు మండలం వరదాపురం శ్రీసాయినాథ్ స్కూల్లో 2014–15 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. 2021లో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఇంకా ఐజీఎన్‌ఓయూలో బీఏ పూర్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో..
రుధిర.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర హైకోర్టు పెట్టిన పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంకు ఎంపికైంది. నెల్లూరు కోర్టులో పనిచేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల గ్రూప్–1 సాధించి ఖజానా శాఖకు ఎంపికయ్యారు.
☛ Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
ఎప్పటికైన నా లక్ష్యం ఇదే..
శ్రీసాయినాథ్ స్కూల్లో కరస్పాడెంట్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి విద్యార్థులను చదివించడంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఇది నా భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్షలు రాసేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు. కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే విజయం సొంతమవుతుందని గ్రూప్–1కు ఎంపికైన ఎల్‌ఎస్‌ఆర్ రుధిర తెలిపారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ర్యాంకర్ రుధిర పూర్తి ఇంటర్వ్యూ కింది వీడియోలో చూడొచ్చు..