Group 1 Ranker Success Story : మా నాన్న కోసమే గ్రూప్-1 ఉద్యోగం కొట్టా.. కానీ ఆ టైమ్‌కు మా నాన్న..
ఈ గ్రూప్-1లో సాధించిన ఈ విజయం నాన్న పెద్దిరెడ్డికి అంకితం చెస్తున్నట్టు తెలిపారు.
నాన్న వీఆర్వోగా పనిచేస్తున్న సమయంలోనే గ్రూప్–1 సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట మండలం, మర్రికొమ్మ దిన్నె మా స్వగ్రామం. అమ్మ అరుణ కుమారి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 అధికారి కావాలనే నాన్న కల నన్ను ఇంత వరకు నడిపించింది. కానీ గ్రూప్–1 కల నెరవేరే సమయానికి మా నాన్న లేరనే బాధ ఉంది.
చదవండి: Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..
రైల్వేలో సూపరింటెండెంట్‌గా..
నా భార్య రవళి గ్రూప్–1కు సన్నద్ధమవుతున్నారు. ఎస్కేయూలో రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందడమే నాకు జీవితంలో ఒక మలుపు లాంటిది. అక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులే నాకు స్పూర్తి. ప్రస్తుతం రైల్వేలో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేస్తున్నా. గతంలోనూ రైల్వే క్లర్క్ ఉద్యోగం వచ్చింది.