HORTICET 2023: హార్టీసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరీ తేదీ ఇదే..
Sakshi Education
తాడేపల్లిగూడెం: ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులో చేరడానికి నిర్వహించనున్న హార్టీసెట్–2023కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉద్యాన వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డీవీ స్వామి జూన్ 19న ఒక ప్రకటనలో తెలిపారు.
హార్టీసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరీ తేదీ ఇదే..
జూలై 15వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హతలు, ఫీజు, అప్లికేషన్ ఫాం, ఇతర వివరాల కోసం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఆగస్టు 22న హార్టీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని వివరించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులో సీట్లు కేటాయిస్తారు.