Daily Current Affairs in Telugu: మార్చి 20, 2023 కరెంట్ అఫైర్స్

XBB1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్..
దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది. ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం.వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది.
H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్..
chandrayaan-3: ‘చంద్రయాన్–3’ ప్రీలాంచ్ పరీక్ష విజయవంతం
చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ప్రీలాంచ్ పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మార్చి 16న ఇస్రో ప్రకటించింది. ఈ వ్యోమనౌక కీలక పరీక్షలు పూర్తిచేసుకుని ప్రయోగానికి సిద్ధమయిందని తెలిపింది. నింగిలోకి దూసుకెళ్లే సమయంలో కంపనం, ధ్వనికి సంబంధించి ఎదురయ్యే కఠిన సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని విజయవంతంగా ధ్రువీకరించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని యుఆర్ రావు కేంద్రంలో మార్చి మొదటి వారంలోనే ఈ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. చంద్రుడిపైన ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ మాడ్యూళ్లతో కూడిన లూనార్‌ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. కాగా 2019లో చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది.
ఈ మిషన్ కోసం ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం, చంద్రునిపై రోవర్ కక్ష్య సామర్థ్యాలను ప్రదర్శించడం, స్వంతంగా శాస్త్రీయ పరిశీలనలను నిర్వహించడం వంటివి ఉన్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
India Bangladesh Diesel Pipeline: భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మార్చి 18న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయన్నారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది.
Arunachal Pradesh: అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం..
New Districts: రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు
రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మార్చి 17న అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది.
• 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి. కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్ వెల్లడించారు.
• కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు.
• విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్ అతిపెద్ద రాష్ట్రం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Global Millets Conference: ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలే పరిష్కారం.. ప్రపంచ చిరుధాన్యాల సదస్సులో మోదీ
ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలు పరిష్కారం కాగలవని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలను కూడా ఇవి దూరం చేస్తాయన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో చిరుధాన్యాల వాడకం 5 నుంచి 6 శాతమే ఉంది. దీన్ని ఇతోధికంగా పెంచి, ఆహారంలో చిరుధాన్యాలు తప్పనిసరిగా మారేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు. మార్చి 18న ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. అందులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం నేడు రెండు రకాల ఆహార సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాల్లోనేమో పేదలకు తినడానికి తిండి దొరకని దుస్థితి! ఉత్తరార్ధ గోళంలోనేమో తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రోగాలు కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. ఒకచోట ఆహార సంక్షోభం. మరోచోట అలవాట్ల సమస్య. సాగులో రసాయనాల మితిమీరిన వాడకంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వీటన్నింటికీ చిరుధాన్యాలు చక్కని పరిష్కారం’’ అని వివరించారు.
పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిరుధాన్యాలకు స్థానం కల్పించాలన్నారు. అలాగే పొలం నుంచి మార్కెట్ దాకా, ఒక దేశం నుంచి మరో దేశం దాకా చిరుధాన్యాలకు పటిష్టమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Supreme Court: కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 18న ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే.
North Korea: చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220
Line of Actual Control: సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితి : జై శంకర్
‘‘తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాతో మన సంబంధాలు సవాలుగా మారాయి. అసాధారణ దశకు చేరుకున్నాయని భావిస్తున్నా’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట కొన్నిచోట్ల రెండు దేశాల సైన్యాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో పరిస్థితులు కొంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారానికి 2020 సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత చైనాదేనని స్పష్టం చేశారు. లేదంటే సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాల్లేవని మార్చి 18న ఇండియా టుడే సదస్సులో కుండబద్దలు కొట్టారు. 2020లో ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం మొదలు పెట్టినప్పటి నుంచే గల్వాన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయ్యాయని జైశంకర్ వివరించారు. ‘‘చైనాకు దీటుగా మనం కూడా సరిహద్దులకు అత్యంత సమీపంలోకి భారీగా బలగాలు, సైనిక సంపత్తి తరలించాల్సి వచ్చింది. బలగాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయి. మేం శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించం, మీరు ఒప్పందాలను ఉల్లంఘించొద్దని చైనాకు చెప్పాం’’ అన్నారు.
WHO: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది.. డబ్ల్యూహెచ్‌వో
2020లో వూహాన్ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్‌లోని హునాన్ మార్కెట్‌లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్‌లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే.
Influenza Cases: పంజా విసురుతున్న ఇన్‌ఫ్లూయెంజా.. ఇలానే ఉంటే లాక్‌డౌన్ తరహా ఆంక్షలు తప్పదు!
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ అరెస్టు!
పంజాబ్‌లో వివాదాస్పద ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ దే పంజాబ్ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్‌ను మార్చి 18న పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు అతనితో పాటు ఆరుగురు మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో అమృత్‌పాల్ అరెస్టుపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. 78 మంది ‘వారిస్ దే’ సంస్థ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
గత నెలలో ఓ కిడ్నాపింగ్ కేసులో అమృత్‌పాల్ అనుచరుడు లవ్‌ప్రీత్‌సింగ్ అలియాస్ తూఫాన్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఫిబ్రవరి 24న అమృత్‌పాల్ వీరంగమే సృష్టించారు. వేలాదిగా తన అనుచరులతో కలిసి కత్తులు, తుపాకులు చేబూని అమృత్‌సర్ నగర శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. బారికేడ్లను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. దాంతో విధి లేక లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలేయాల్సి వచ్చింది! విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారంటూ అమృత్‌పాల్, అతని ఆరుగురు అనుచరులపై కేసు నమోదైంది. మందీమార్బలంతో జలంధర్‌లోని షాకోట్ వెళ్తున్న అమృత్‌పాల్‌ను ఒక్కసారిగా చుట్టుముట్టారు. చాలాసేపు వెంటాడి చివరికి జిల్లా సరిహద్దుల్లోని మెహత్‌ఫర్ సమీపంలో అమృత్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
International Criminal Court: పుతిన్‌ను బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా.. అసలు పుతిన్‌పై ఉన్న ఆరోపణలేంటి?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్‌ను అరెస్ట్ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా?
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాది పూర్తి
పుతిన్‌పైనున్న ఆరోపణలేంటి?
ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్‌తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ISL Trophy: ఐఎస్‌ఎల్ విజేత ఏటీకే మోహన్ బగాన్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్‌ను ఏటీకే మోహన్ బగాన్ (కోల్‌కతా) ఫుట్‌బాల్ క్లబ్ తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏటీకే మోహన్ బగాన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 4–3తో బెంగళూరు ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’ లో మోహన్ బగాన్ తరఫున వరుసగా పెట్రాటోస్, లిస్టన్, కియాన్, మాన్వీర్ గోల్స్ చేశారు. బెంగళూరు తరఫున అలన్ కోస్టా, రాయ్ కృష్ణ, సునీల్ చెత్రి సఫలంకాగా.. రమిరెస్, పెరెజ్ విఫలమయ్యారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Millet Man: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత
నలభై ఏళ్ల క్రితం డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్)ని స్థాపించి, పాత పంటలు, సంప్రదాయ పంటలు, చిరుధాన్యాల సంరక్షణను ఉద్యమంలా చేపట్టి తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా పేరుగాంచిన పీవీ సతీష్ (77) మార్చి 19న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. దేశ వ్యాప్తంగా మిల్లెట్ పునరుద్ధరణకు ఆయన శ్రమించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. మహిళా రైతులతో కలిసి పాత పంటల పరిరక్షణ కోసం 1983 నుంచి కృషి చేస్తూనే, వారితోనే సంప్రదాయ పంటలు, వాటి ఆవశ్యకత గురించి కమ్యూనిటీ రేడియోను ప్రారంభించారు. వారు స్థాపించిన సొసైటీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలలో ఈక్వేటర్ ప్రైజ్‌ను గెలుచుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
ప్రతీ సంక్రాంతికి ‘పాత పంటల జాతర’ను సతీష్ నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభించింది. డీడీఎస్ సంస్థకు పలు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక వృక్షమిత్ర అవార్డు సైతం సాధించింది.
తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన పెరియపట్నం వెంకట సుబ్బయ్య సతీశ్ 1945వ సంవత్సరం జూన్ 18న మైసూర్‌లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు అగ్రగామి టెలివిజన్ నిర్మాతగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. 1970లో చారిత్రక ఉపగ్రహ బోధనా టెలివిజన్ ప్రమోగం(ఎస్‌ఐటీఈ)లో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1980 కాలంలో సతీష్ కొంతమంది మిత్రులతో కలిసి జహీరాబాద్ ప్రాంతంలో డీడీఎస్ సంస్థను ప్రారంభించారు. భారత దేశ మొట్ట మొదటి కమ్యూనిటీ మీడియా ట్రస్ట్‌ను ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. నిరక్షరాస్యులైన దళిత మహిళలను ప్రోత్సహించి వారికి మీడియా, వీడియో రంగంలో శిక్షణ ఇప్పించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం
Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Himalayas: మంచుకొండల్లో మహాముప్పు.. కరిగిపోనున్న హిమానీనదాలు.. మాయమవనున్న సరస్సులు!
ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై..
☛ అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ అ్రస్టానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు.
☛ చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది.
☛ చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది.
☛ చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Moon: భూమికి క్రమంగా దూరమవుతున్న చంద్రుడు.. ఏటా ఎంత దూరం జరుగుతున్నాడంటే?
Earthquake: ఈక్వెడార్, పెరూల్లో భూకంపం.. 14 మంది మృతి
ఈక్వెడార్–పెరూ సరిహద్దుల్లో మార్చి 18న భారీ భూకంపం సంభవించింది. భవనాలు కూలిన ఘటనల్లో 14 మంది చనిపోయారు. మృతుల్లో 13 మంది ఈక్వెడార్‌కు, ఒకరు పెరూకు చెందిన వారు. మరో 126 మంది గాయపడినట్లు ఈక్వెడార్ అధికారులు చెప్పారు. మృతుల్లో 11 మంది ఎల్ ఒరోకు చెందిన వారేనన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పలు భవనాలు బీటలు వారాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పసిఫిక్ తీరంలో ఈక్వెడార్ రెండో పెద్ద నగరం గుయాక్విల్ కేంద్రంగా ఉన్న ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి
Rohan Bopanna: ఏటీపీ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా బోపన్న రికార్డు
నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మార్చి 19న జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు.. రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్‌సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
☛ బోపన్న కెరీర్‌లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.
☛ బోపన్న కెరీర్‌లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్‌లో ఎబ్డెన్‌తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.
Hockey India Awards: హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా సవితా పూనియా, హార్దిక్ సింగ్
Akshdeep Singh: అక్ష్‌దీప్ సింగ్‌కు స్వర్ణం
ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అక్ష్‌దీప్‌దీప్ సింగ్ 1 గంట 20 నిమిషాల 57 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఓపెన్ కేటగిరీలో పోటీపడిన భారత అథ్లెట్లు వికాష్ సింగ్, పరమ్‌జీత్ ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ప్రపంచ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం 1 గంట 20 నిమిషాల 10 సెకన్లను వికాష్ (1గం:20ని :05 సెకన్లు), పరమ్‌జీత్ (1గం: 20:08 సెకన్లు) అందుకున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో పోటీపడిన వారి సమయాన్ని పతకాల కోసం పరిగణనలోకి తీసుకోరు.