Skip to main content

Chandrayaan-3: ‘చంద్రయాన్‌–3’లో కీలక పరీక్ష విజయవంతం

చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్‌ ఇంటర్‌ఫియరెన్స్‌/ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్‌ కంపాటిబిలిటీ(ఈఎంఐ/ఈఎంసీ) పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఫిబ్ర‌వరి 19వ తేదీ ప్రకటించింది.
Chandrayaan-3

బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈ పరీక్ష నిర్వహించారు. శాటిలైట్‌ ఉప వ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ/ఈఎంసీ టెస్టు నిర్వహించారు. శాటిలైట్‌ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపైన లూనార్‌ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. కాగా 2019లో చంద్రయాన్‌–2 ప్రయోగం విఫలమైన విష‌యం మ‌న‌కు తెలిసిందే.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 20 Feb 2023 12:56PM

Photo Stories