H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్..
దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ముగ్గురు మరణించినట్లు సమాచారం. H3N2 వైరస్ కారణంగా హర్యానా, కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు రోగులు మరణించగా, తాజాగా గుజరాత్‌లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వైరస్‌తో బాధపడేవారిలో జలుబు, ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు.. అయితే ఆ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులకు సకాలంలో వైద్యం అందకపోతే.. బాధితులు ప్రాణాలు కోల్పొయే ప్రమాదం ఉందని, సరైన సమయంలో చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు.
H3N2 Influenza: హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు.. ఎలా వ్యాపిస్తుంది ?
ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం వీరిపై అధికం..
ఫ్లూ వ్యాక్సిన్ H3N2 వైరస్‌ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది. సీజనల్ ఇన్ ఫ్లూయెంజా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజుల పాటు ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.