Skip to main content

CBSE Mandates NCERT Textbooks for Schools: ఇకపై ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు తప్పనిసరి.. స్కూళ్లకు సీబీఎస్‌ఈ ఆదేశాలు

CBSE Mandates NCERT Textbooks for Schools

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సవరించిన మార్పుల ప్రకారం.. ఇకపై అన్ని స్కూళ్లలో 9-12వ తరగతి విద్యార్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) పుస్తకాలను తప్పనిసరి చేసింది.

August 25, 26th Holidays 2024 : ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు.. ఎందుకంటే..?

అలాగే 1-8వ తరగతి విద్యార్థులకు NCERT లేదా SCERT (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అందించే పుస్తకాలను అనుసరించాలని తెలిపింది. దీనికి అదనంగా ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. హింసను ప్రేరేపించేలా,సున్నితమైన,మతపరమైన అంశాలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి అంశాలు పాఠ్యపుస్తకాలు ఉండకూడదని హెచ్చరించింది.

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలకు అదనంగా సంబంధిత మెటీరియల్‌ లేదా డిజిటల్‌ కంటెంట్‌ ఎంచుకునేటప్పుడు అది నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్-ఫౌండేషనల్ స్టేజ్ (NCF-FS), నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్-స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE)కు అనుగుణంగా ఉండాలని, దీనిపై ఆయా స్కూళ్లపైనేపూర్తి బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.

IIT Madras: దేశంలోనే టాప్‌-1గా ఐఐటీ మద్రాస్‌..ఎందుకంత స్పెషల్‌? ప్లేస్‌మెంట్స్‌ కారణమా?

వివాదాస్పద కంటెంట్‌ను కలిగిన పుస్తకాలను అనుసరిస్తే, ఆయా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ఇటీవలె ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. 
 

Published date : 16 Aug 2024 04:02PM

Photo Stories