Skip to main content

Telangana 3days School Holidays News: తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవు ఎందుకంటే..?

Three days holidays in telengana schools school holidays news  Announcement of school holidays due to rain   School holidays due to heavy rain in Telangana
school holidays news

తెలంగాణలో గత 3, 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లింది. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు.. వర్షం, వరద కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ నేపథ్యంలో......

తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా అని లేదు.. అన్ని చోట్లా వరుణుడు చెలరేగిపోతున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని.. నీట మునిగాయి. బ్యారేజీల్లో నీటి మట్టం.. గరిష్ఠ స్థాయికి చేరింది. చెరువులు, కాలువలు.. పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి.

Anganwadi School Timings Change news: ఇక నుంచి అంగన్‌వాడీ టైమింగ్స్‌లో మార్పు

ఇక హైదరాబాద్‌లో.. పలు ప్రాంతాల్లో వరద ఎఫెక్ట్ ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

తెలంగాణలోని చాలా ప్రాంతాలు వరదు ముంపుకు గురయ్యాని..  నదులు, చెరువులు, వాగులు, వంకలు, తూములు, నాలాలు పొంగిపొర్లుతుండటంతో స్టూడెంట్స్.. స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని..  ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్ల కుండా రెండు, మూడ్రోజులు హాలిడేస్ ఇవ్వాలని వేముల రామకృష్ణ కోరారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఇక, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.. మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.  ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Anganwadi 9000 jobs news: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 9వేల ఉద్యోగాలు..

కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్‌‌లోనూ మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సిటీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. తెలియని దారుల్లో వెళ్లకపోడమే మంచింది. పలు చోట్ల కరెంట్ షాక్ ఘటనలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తత అవసరం.

ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య హయత్‌నగర్‌ మండల కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ గౌడ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్‌, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్‌ ఉన్నారు.

Published date : 24 Jul 2024 06:01PM

Photo Stories