Scholarship Program: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కోసం దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education

గద్వాల అర్బన్: ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం 2024–25 విద్యా సంవత్సరం అందించే అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిణి సరోజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోఫెల్, గ్రే, జిమ్యాట్, ఐఈఎల్‌టీఎస్ నందు ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు.
Teaching Jobs: మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
యూకే, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈనెల 14 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు సంబంధిత ధ్రువపత్రాలతో www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 14 Aug 2024 02:47PM