National Merit Scholarships: నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు..
Sakshi Education
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. 2024లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గతంలో అప్లై చేసుకున్న వారు అప్లికేషన్ రెన్యువల్ చేసుకునేందుకు డిసెంబర్ 15 వరకు సమయం ఉంది.
National Merit Scholarships
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://scholarships.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ వచ్చిన మొత్తం విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
వీరు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించింది. అంతేకాకుండా గతంలో ఈ ఉపకారవేతనాలకు ఎంపికైన వారు 2024–25 సంవత్సరానికి తమ దరఖాస్తులను రెన్యువర్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
BC Overseas Vidya Nidhi scholarship BC Overseas Vidya Nidhi scholarships are pending List of eligible candidates not released even though courses are ending