Internship Program: డిగ్రీ విద్యార్థులకు 6నెలల పాటు ఇంటర్న్‌షిప్
Sakshi Education
చింతపల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 27న ఇంటర్న్‌షిప్ ప్రవేశాలను కల్పిస్తున్నట్లు కళాశాల పిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయబారతి తెలిపారు.
Internship Program
ఆమె విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఆరు నెలలపాటు శిక్షణకు పంపిస్తామన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు సిటీ ఇండస్ట్రీస్ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జగదీష్‌బాబు, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.